రాయల్ ఎన్‌ఫీల్డ్ '2014 టూర్ ఆఫ్ టిబెట్' ప్లాన్ వెల్లడి

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లపై దూర ప్రయాణాలు చేయటమంటే మీకు ఇష్టమా..! అయితే ఈ అవకాశం మీ కోసమే. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బ్రాండ్ బైక్ ప్రియుల కోసం రెండవ ఎడిషన్ 'టూర్ ఆఫ్ టిబెట్' 2014 ప్లాన్‌ను వెల్లడిం చేసింది. ఈ టూర్‌కి 'రూఫ్ ఆఫ్ ది వరల్డ్' అనే పాపులర్ పేరు కూడా ఉంది.

2014వ సంవత్సరానికి గాను టూర్ ఆఫ్ టిబెట్ సెప్టెంబర్ 7, 2014న ప్రారంభమైన సెప్టెంబర్ 20, 2014న ముగుస్తుంది. మొత్తం 14 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లపై 2,380 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తారు. ఇందులో 30 మందికి పైగా రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లు పాల్గొంటారు.


రాయల్ ఎన్‌ఫీల్డ్ 2014 టూర్ ఆఫ్ టిబెట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం మరియు ఇందులో పాల్గొనటం కోసం రిజిస్టర్ చేసుకునేందుకు గాను http://royalenfield.com/rides/events/tour-of-tibet-2014/summary ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

ఈ రైడ్ కాట్మండు వద్ద ప్రారంభమవుతుంది, ఇది ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ప్రారంభమవుతుంది. 'ప్యూర్ మోటార్‌సైక్లింగ్'ను ఎంజాయ్ చేసే రైడర్ల కోసం టూర్ ఆఫ్ టిబెట్‌ను ఆర్గనైజ్ చేస్తారు. గడచిన సంవత్సరం (2013)లో కేవలం 17 రైడర్లు మాత్రమే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోగలిగారు.

కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పటికే భూటాన్, నేపాల్‌లకు 2014లో రైడ్‌లను ఆర్గనైజ్ చేసింది. ఈ ఏడాది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు టూర్ ఆఫ్ టిబెట్ 3వ అంతర్జాతీయ రైడ్ కావటం విశేషం. టూర్ ఆఫ్ టిబెట్ ఇటు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌కి అటు దానిని నడిపే రైడర్‌కు సవాలు కానుంది.

Royal Enfield 2014 Tour Of Tibet Plan Revealed

ఈ రూట్‌లో అందమైన రోడ్లతో పాటుగా ఆఫ్-రోడ్ తరహా పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ప్రకృతి అందాలను తిలకిస్తూ, పర్వతాలను దాటుకుంటూ ఈ ప్రయాణం సాగిపోతుంది. సుదూర ప్రయాణాలను ఆస్వాదించే ప్రతి నిజమైన మోటార్‌సైక్లిస్ట్ తమ జీవితంలో ఖచ్చితంగా చేసి తీరాల్సిన రైడ్ ఇది.

సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ బ్రాండ్ బైక్ యజమానుల కోసం తరచూ అనేక కార్యక్రమాలు, రోడ్ ట్రిప్స్ నిర్వహిస్తూనే ఉంటుంది. కానీ ఈ టూర్ ఆఫ్ టిబెట్ ట్రిప్‌ను మాత్రం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి, ఈ సువర్ణావకాశాన్ని మిస్ కాకుండా, ప్రకృతి వడిలో పరివశించి పోయేందుకు సిద్ధం కండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 13, 2014, 15:10 [IST]
English summary
The Royal Enfield is among the most preferred motorcycles for long distance riding as well as for tough terrain. The Indian manufacturer has announced the details of its second edition 'Tour of Tibet' in 2014. The ride is popularly known as the journey to the 'Roof of the World'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+