అక్టోబర్‌లో రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్
ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ విషయంలో గతంలో చెప్పిన దానిని మరోసారి ధృవీకరించింది. గతంలో కంపెనీ ఆవిష్కరించిన విభిన్నమైన, విశిష్టమైన మోటార్‌సైకిల్ కెఫే రేస్ రానున్న అక్టోబర్ నెలలో భారత మార్కెట్లో ప్రవేశపెడతామని కంపెనీ స్పష్టం చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫె రేసర్ మోటార్‌సైకిల్‌ను సెప్టెంబర్‌లో యూకే మార్కెట్లో విడుదల చేస్తామని, అనంతరం అక్టోబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.
మిడ్-సైజ్డ్ సెగ్మెంట్లో అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా విదేశీ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఈ ఉత్పత్తి సెప్టెంబర్ నెలలో యూకే విడుదల చేయనున్నామని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ్ లాల్ తెలిపారు. ఈ బైక్‌కు సంబంధించి అంతకు మించిన కొత్త సమాచారాన్ని ఆయన వెల్లడించలేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ గురించి మాకు తెలిసిన సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో మీతో పంచుకుంటున్నాం.

అక్టోబర్ నెలలో విడుదల కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ బైక్‌లో 535సీసీ, ఫోర్-స్ట్రోక్, ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది యూకెక చెందిన హ్యారిస్ ఇంజనీరింగ్ సహకారంతో అభివృద్ధి చేసిన సరికొత్త ఇంజన్.

కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ ఒక సింగిల్ సీటర్ బైక్. లో-స్లంగ్ క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్స్, లాంగ్ ఫ్యూయెల్ ట్యాంక్, స్ట్రైట్ సీట్, క్లాసిక్ రౌండ్ హెడ్‌లైట్స్ ఈ బైక్ ప్రధాన ఆకర్షణలు. భారత మార్కెట్ కోసం ఇందులో 2-సీటర్ వెర్షన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

లైట్ డబల్ క్రాడల్ ఫ్రేమ్ (రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లలో తొలిసారిగా ఉపయోగించటం), పైయోలి షాక్స్, పీరెల్లీ టైర్స్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు కాంటినెంటల్ జిటి ఇతర ప్రత్యేకతలు. ఇది రాయల్ ఎన్‌ఫీల్ నుండి లభ్యం కానున్న అత్యంత తేలికైన, వేగవంతమైన మోటార్‌సైకిల్‌గా నిలువనుంది.

కేఫె రేసర్ వంటి వంటి మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కే కాకుండా భారతదేశానికే మొట్టమొదటి బైక్. ఇప్పటి వరకు ఈ తరహా బైక్ ఇండియాలో అందుబాటులో లేదు. భారత మార్కెట్లో దీని ధర రూ.2.25 లక్షల రేంజ్‌లో ఉండొచ్చి అంచనా.


Click it and Unblock the Notifications








