రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ విడుదల

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్, భారత్ కన్నా ముందుగానే యూకే మార్కెట్లో విడుదలయ్యింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 60 ఏళ్ల చరిత్రలో తొలి కాంటినెంటల్ జిటి కావటం విశేషం. 50, 60వ దశకాల్లోని కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేశారు.

కాంటినెంటల్ జిటి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న అత్యంత శక్తివంతమైన బైక్. యూకే మార్కెట్లో రాయన్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్ ధర 5,200 పౌండ్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.5.2 లక్షలు). వచ్చే అక్టోబర్ నెలలో ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. యూకే మార్కెట్లో విడుదలైన కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌ను చెన్నైకు సమీపంలో ఉన్న ఓరగడం ప్లాంట్‍‌లో ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌‌లో పరిశీలించండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌‌లో 535సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ యూనిట్ కన్స్‌ట్రక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ 500సీసీ బైక్‌లలో ఉపయోగిస్తున్న ఇంజన్ లాంటిదే. అయితే, దీని సామర్థ్యాన్ని పెంచేందుకు గాను బోర్ సైజ్‌ను కూడా పెంచారు. ఇది కొత్త ఈసియూ ఫ్యూయెల్ మ్యాపింగ్‌తో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

ఈ ఇంజన్ 5100 ఆర్‌పిఎమ్ వద్ద 28.7 హార్స్ పవర్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 44 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

ప్రస్తుతం కొత్త ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను (ఇంజన్‌ను అమర్చే ఫ్రేమ్) ఉపయోగించుకొని తయారవుతున్న ఏకైక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా కాంటినెంటల్ జిటి కావటం మరొక విశేషం. ఈ ఫ్రేమ్‌ను ప్రత్యేకించి కాంటినెంటల్ జిటి కోసం హ్యారిస్ పెర్ఫామెన్స్ సహకారంతో తయారు చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

కెఫే రేసర్ స్టైల్‌లో కనిపించే ఈ బైక్, లో స్లంగ్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ట్రైట్ సీట్, విశిష్టమైన 13.5 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో ఇది కాంపాక్ట్ రైడింగ్ పొజిషన్‌లో కూర్చునేందుకు సహకరిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

ఇందులోని 41 మి.మీ. ఫ్రంట్ ఫోర్క్ 110 మి.మీ. ట్రావెల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 80 మి.మీ. ట్రావెల్‌తో కూడిన రెండు గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్స్‌ను అమర్చారు. పైయోలీ నుంచి గ్రహించిన ఈ షాక్స్ ప్రీలోడ్ అడ్జస్ట్‌ను కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

ఈ బైక్‌లో ఉపయోగించిన బ్రేక్స్‌ను బ్రెమ్బూ నుంచి గ్రహించారు. ముందు వైపు రెండు ఫ్లోటింగ్ కాలిపర్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు సింగిల్ కాలిపర్ డిస్క్ బ్రేక్స్‌ను అమర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్

కాంటినెంటల్ జిటిలో ఉపయోగించిన టైర్లను పీరెల్లీ స్పోర్ట్ డెమాన్ నుంచి గ్రహించారు. పూర్తి ట్యాంకుతో కలిపి దీని బరువు 184 కేజీలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న 500సీసీ బైక్‌లలో కెల్లా ఇదే అత్యంత తేలికైనది.

వీడియో

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ వీడియోను వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 12, 2013, 14:01 [IST]
English summary
Royal Enfield has launched the India built Continental GT cafe racer in UK. The Continental GT is the company's first cafe racer in 60 years. Inspired by the cafe racer style bikes of the 50's and 60's, the launch of the bike in UK, at Ace Cafe London is seen as a return to its roots. The Continental GT is the most powerful bike coming from Royal Enfield.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+