రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి: ధర, ఇతర వివరాలు

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకొనే రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ లేటెస్ట్ కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్ 'కాంటినెంటల్ జిటి'ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంపెనీ ఈ బైక్‌ను విడుదల చేసింది. 1960వ దశకానికి చెందిన పురాతన బ్రిటీష్ జిటి బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది ఈ బైక్‌ను డిజైన్ చేశారు.

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి బైక్ ధర రూ.2.05 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ)గా ఉంది. దశల వారీగా ఈ బైక్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని, పంజాబ్‌తో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ బైక్‌ను రూ.2 లక్షల లోపు ధరకే (ఆన్-రోడ్) విక్రయిస్తామని కంపెనీ తెలిపింది.

కంపెనీ 60 ఏళ్ల చరిత్రలో ఇది తొలి కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ అంతేకాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న అత్యంత శక్తివంతమైన మరియు తేలికైన మోటార్‌సైకిల్ కూడా ఇదే. రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఐషర్ మోటార్స్‌కు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గడచిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా తమ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌‌ను భారత్‌కు పరిచయం చేసింది. 1960లో యూకేలోని ఓ సాంప్రదాయమైన కెఫే రేసింగ్ నుంచి స్ఫూర్తి పొంది ఈ బైక్‌ను తయారు చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌‌లో 535సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ 500సీసీ బైక్‌లలో ఉపయోగిస్తున్న ఇంజన్ లాంటిదే. అయితే, దీని సామర్థ్యాన్ని పెంచేందుకు గాను బోర్ సైజ్‌ను కూడా పెంచారు. ఇది కొత్త ఈసియూ ఫ్యూయెల్ మ్యాపింగ్‌తో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఈ 535ససీ ఇంజన్ 5100 ఆర్‌పిఎమ్ వద్ద 29.1 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 44 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ప్రస్తుతం కొత్త ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను (ఇంజన్‌ను అమర్చే ఫ్రేమ్) ఉపయోగించుకొని తయారవుతున్న ఏకైక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా కాంటినెంటల్ జిటి కావటం మరొక విశేషం. ఈ ఫ్రేమ్‌ను ప్రత్యేకించి కాంటినెంటల్ జిటి కోసం యూకెకు చెందిన హ్యారిస్ పెర్ఫామెన్స్ సహకారంతో కలిసి కంపెనీ తయారు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

కెఫే రేసర్ స్టైల్‌లో కనిపించే ఈ బైక్‌‌లో స్లంగ్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ట్రైట్ సీట్, విశిష్టమైన 13.5 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో ఇది కాంపాక్ట్ రైడింగ్ పొజిషన్‌లో కూర్చునేందుకు సహకరిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఇందులోని 41 మి.మీ. ఫ్రంట్ ఫోర్క్ 110 మి.మీ. ట్రావెల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 80 మి.మీ. ట్రావెల్‌తో కూడిన రెండు గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్స్‌ను అమర్చారు. పైయోలీ నుంచి గ్రహించిన ఈ షాక్స్ ప్రీలోడ్ అడ్జస్ట్‌ను కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఈ బైక్‌లో ఉపయోగించిన బ్రేక్స్‌ను బ్రెమ్బూ నుంచి గ్రహించారు. ముందు వైపు రెండు 300 మి.మీ. డిస్క్ మరియు 2 పిస్టన్ కాలిపర్ అలాగే వెనుక వైపు 240 మి.మీ. డిస్క్ మరియు సింగిల్ కాలిపర్‌ను అమర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

కాంటినెంటల్ జిటిలో ఉపయోగించిన టైర్లను పీరెల్లీ స్పోర్ట్ డెమాన్ నుంచి గ్రహించారు. పూర్తి ట్యాంకుతో కలిపి దీని బరువు 184 కేజీలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న 500సీసీ బైక్‌లలో కెల్లా ఇదే అత్యంత తేలికైనది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కొలతలు క్రింది విధంగా ఉన్నాయి:

వీల్‌బేస్: 1360 మి.మీ

గ్రౌండ్ క్లియరెన్స్: 140 మి.మీ

పొడవు: 2060 మి.మీ.

వెడల్పు: 760 మి.మీ.

ఎత్తు: 1070 మి.మీ.

సీట్ ఎత్తు: 800 మి.మీ.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి అత్యంత తేలికైన 500సీసీ సెగ్మెంట్ బైక్. దీని మొత్తం బరువు 184 కేజీలు మాత్రమే (90 శాతం నిండిన ఫ్యూయెల్ ట్యాంక్‌తో కలిపి). ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ ధర రూ.2.05 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ), రూ.2.14 లక్షలు (ఆన్-రోడ్, ముంబై)గా ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ పూర్తి రివ్యూ కోసం తెలుగు డ్రైవ్‍‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2013, 12:00 [IST]
English summary
The much awaited Royal Enfield Continental GT cafe racer was launched in a grand event held in Goa. Termed as the lightest and the fastest Royal Enfield till date the cafe racer is priced at an extremely competitive INR 2.05 lakhs in Delhi and INR 2.14 lakhs in Mumbai. Both are on-road prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+