నవంబర్ 26న రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి విడుదల

By Ravi

ఇటీవలే యూకే మార్కెట్లో విడుదలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్ వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదలకానుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, నవంబర్ 26న రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 60 ఏళ్ల చరిత్రలో తొలి కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ కావటం విశేషం. 50, 60వ దశకాల్లోని కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిళ్ల నుంచి స్ఫూర్తి పొంది ఈ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేశారు. కాంటినెంటల్ జిటి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యం కానున్న అత్యంత శక్తివంతమైన మరియు తేలికైన మోటార్‌సైకిల్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ మోటార్‌సైకిల్‌‌లో 535సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ యూనిట్ కన్స్‌ట్రక్షన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ 500సీసీ బైక్‌లలో ఉపయోగిస్తున్న ఇంజన్ లాంటిదే. అయితే, దీని సామర్థ్యాన్ని పెంచేందుకు గాను బోర్ సైజ్‌ను కూడా పెంచారు. ఇది కొత్త ఈసియూ ఫ్యూయెల్ మ్యాపింగ్‌తో లభిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఈ ఇంజన్ 5100 ఆర్‌పిఎమ్ వద్ద 28.7 హార్స్ పవర్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 44 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ప్రస్తుతం కొత్త ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను (ఇంజన్‌ను అమర్చే ఫ్రేమ్) ఉపయోగించుకొని తయారవుతున్న ఏకైక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా కాంటినెంటల్ జిటి కావటం మరొక విశేషం. ఈ ఫ్రేమ్‌ను ప్రత్యేకించి కాంటినెంటల్ జిటి కోసం హ్యారిస్ పెర్ఫామెన్స్ సహకారంతో తయారు చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

కెఫే రేసర్ స్టైల్‌లో కనిపించే ఈ బైక్‌‌లో స్లంగ్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్, స్ట్రైట్ సీట్, విశిష్టమైన 13.5 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో ఇది కాంపాక్ట్ రైడింగ్ పొజిషన్‌లో కూర్చునేందుకు సహకరిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఇందులోని 41 మి.మీ. ఫ్రంట్ ఫోర్క్ 110 మి.మీ. ట్రావెల్‌ను కలిగి ఉంటుంది. వెనుక వైపు 80 మి.మీ. ట్రావెల్‌తో కూడిన రెండు గ్యాస్ ఛార్జ్‌డ్ షాక్స్‌ను అమర్చారు. పైయోలీ నుంచి గ్రహించిన ఈ షాక్స్ ప్రీలోడ్ అడ్జస్ట్‌ను కలిగి ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఈ బైక్‌లో ఉపయోగించిన బ్రేక్స్‌ను బ్రెమ్బూ నుంచి గ్రహించారు. ముందు వైపు రెండు ఫ్లోటింగ్ కాలిపర్ డిస్క్ బ్రేక్, వెనుక వైపు సింగిల్ కాలిపర్ డిస్క్ బ్రేక్స్‌ను అమర్చారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

కాంటినెంటల్ జిటిలో ఉపయోగించిన టైర్లను పీరెల్లీ స్పోర్ట్ డెమాన్ నుంచి గ్రహించారు. పూర్తి ట్యాంకుతో కలిపి దీని బరువు 184 కేజీలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి లభ్యమవుతున్న 500సీసీ బైక్‌లలో కెల్లా ఇదే అత్యంత తేలికైనది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్ ధర సుమారు రూ.2.25 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన అన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‍‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలోపుగా తర్వాతి స్లైడ్‌లో ఈ మోటార్‌సైకిల్ వీడియోని వీక్షించండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి కెఫే రేసర్ వీడియోను వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2013, 11:47 [IST]
English summary
Royal Enfield Continental GT to be launched in India on November 26, 2013. The Continental GT is the company's first cafe racer in 60 years. Inspired by the cafe racer style bikes of the 50's and 60's, the launch of the bike in UK, at Ace Cafe London is seen as a return to its roots. The Continental GT is the most powerful bike coming from Royal Enfield. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+