కొత్త బుల్లెట్ 500ను విడుదల చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్

By Ravi

బుల్లెట్ మోటార్‌సైకిల్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. బైక్‌లను నడిపే ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో బుల్లెట్ బైక్‌ గురించి ప్రస్తావించుకునే ఉంటారు. డుగు డుగు శబ్ధంతో రోడ్డుపై బుల్లెట్ బైక్ వస్తుంటే, తల తిప్పుకోని వారెవ్వరూ ఉండరేమో. ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా పేరొంది రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ బుల్లెట్ బైకులే. సరే ఇదంతా అటుంచితే, బుల్లెట్ బైక్ ప్రియులకు ఓ శుభవార్త. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ త్వరలోనే ఓ సరికొత్త 500సీసీ బుల్లెట్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలో, తమ అధికారిక వెబ్‌సైట్‌లో కంపెనీ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మార్కెట్లో అందిస్తున్న బుల్లెట్ సిరీస్ బైక్‌లకు పూర్తిగా భిన్నంగా, అధునాతన ఇంజన్, ఫీచర్లను జోడించిన సరికొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తాజాగా అందిస్తున్న అధునాతన 500సీసీ ఇంజన్‌ను ఈ బైక్‌లోను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ 500సీసీ ఏవిఎల్ ఇంజన్ మునుపటి వెర్షన్ 500సీసీ ఇంజన్ కన్నా అదనంగా 2 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఈ లేటెస్ట్ ఇంజన్ ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజక్షన్, డిస్క్ బ్రేక్స్, ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్, 27.5 పిఎస్ పవర్ వంటి విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది. టీజర్ ఇమేజ్‌ను బట్టి చూస్తుంటే, కొత్త బుల్లెట్ 500 డార్క్ గ్రీన్ కలర్‌లో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఒకప్పట్లో ఈ గ్రీన్ కలర్ అత్యంత పాపులర్ అయిన మోడల్. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న బుల్లెట్ 500 కూడా మంచి సక్సెస్‌ను సాధించవచ్చని తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కెఫే రేసర్ (కాంటినెంటల్ జిటి) బైక్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనుంది.

ప్రస్తుతం బుల్లెట్ సిరీస్‌‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న మోటార్‌సైకిళ్లపై ఓ లుక్కేద్దాం రండి..!

సరికొత్త బుల్లెట్ 500 టీజర్

సరికొత్త బుల్లెట్ 500 టీజర్

బుల్లెట్ 350 ట్విన్‌‌స్పార్క్

బుల్లెట్ 350 ట్విన్‌‌స్పార్క్

బుల్లెట్ 350 ట్విన్‌‌స్పార్క్

బుల్లెట్ 350 ట్విన్‌‌స్పార్క్

బుల్లెట్ 500 ఈఎఫ్ఐ

బుల్లెట్ 500 ఈఎఫ్ఐ

బుల్లెట్ 500 ఈఎఫ్ఐ

బుల్లెట్ 500 ఈఎఫ్ఐ

బుల్లెట్ ఎలక్ట్రా డీలక్స్

బుల్లెట్ ఎలక్ట్రా డీలక్స్

బుల్లెట్ ఎలక్ట్రా డీలక్స్

బుల్లెట్ ఎలక్ట్రా డీలక్స్

బుల్లెట్ ఎలక్ట్రా ఈఎఫ్ఐ

బుల్లెట్ ఎలక్ట్రా ఈఎఫ్ఐ

బుల్లెట్ ఎలక్ట్రా ఈఎఫ్ఐ

బుల్లెట్ ఎలక్ట్రా ఈఎఫ్ఐ

బుల్లెట్ ఎలక్ట్రా ట్విన్‌స్పార్క్

బుల్లెట్ ఎలక్ట్రా ట్విన్‌స్పార్క్

బుల్లెట్ ఎలక్ట్రా ట్విన్‌స్పార్క్

బుల్లెట్ ఎలక్ట్రా ట్విన్‌స్పార్క్

More from DriveSpark

Article Published On: Tuesday, April 9, 2013, 12:24 [IST]
English summary
Royal Enfield is all set to launch an all-new 500cc Bullet motorcycle in the coming months. The company has already released a teaser image on its official website.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+