సరికొత్త బుల్లెట్ 500ను విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500 మోటార్‌సైకిల్ గురించిన అప్‌డేట్స్‌ను తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఎప్పటికప్పుడు మా పాఠకులకు చేరవేస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ సరికొత్త బుల్లెట్ 500 మోటార్‌సైకిల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ నేడు మార్కెట్లో విడుదల చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కంపెనీ ఈ కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 500 బైక్ ధర రూ.1.53 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.
ప్రారంభంలో భాగంగా ఈ క్లాసిక్ బుల్లెట్ పంజాబ్, హర్యానా, ఛండీఘడ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్ మరియు కేరళ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది. తర్వాత దశల వారీగా ఈ బైక్‌ను దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకువచ్చే ఆస్కారం ఉంది. బుల్లెట్ ట్విన్‌స్పార్క్ సిరీస్‌లో కొత్త వేరియంట్‌గా వచ్చిన ఈ బైక్‌లో 499సీసీ ట్విన్ స్పార్క్, ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఈ ఇంజన్ గరిష్టంగా 5100 ఆర్‌పిఎమ్ వద్ద 26.1 బిహెచ్‌పిల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 4.17 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ (1 క్రిందకు, 4 పైకి) మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మొత్తం 193 కిలోల బరువును కలిగి ఉంటుంది. సింగిల్ డౌన్‌ట్యూబ్ ట్యూబ్లర్ స్టీల్ ఫ్రేమ్ ఆధారంగా నిర్మించిన ఈ కొత్త బుల్లెట్ 500 బైక్ ముందువై టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను మరియు వెనుక వైపు గ్యాచ్-ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్లను ఉపయోగించారు.

బుల్లెట్ 500ను విడుదల చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఈ మోటార్‌సైకిల్‌లో ముందు వైపు 90/90 x 19 ఇంచ్ టైరును, వెనుక వైపు 120/80 x 18 ఇంచ్ టైరును ఉపయోగించారు. సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇందులో ముందు వైపు 280 మి.మీ. డిస్క్ బ్రేకును, వెనుక వైపు 153 మి.మీ. డ్రమ్ బ్రేకును అమర్చారు. ఇది సరికొత్త "అడవి పచ్చ రంగు" (ఫారెస్ట్ గ్రీన్ కలర్)లో లభ్యమవుతుంది.
పిలియన్ రైడర్ (వెనుక కూర్చునే ప్రయాణికుడి) కోసం కుషన్డ్ గ్రాబ్ రెయిల్, ట్రెడిషనల్ సీట్, ట్యాంక్‌పై అమర్చిన గోల్డ్ అండ్ సిల్వర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ వింగ్డ్ బ్యాడ్జ్, హెడ్‌ల్యాంప్‌కు పైభాగంలో అమర్చిన ట్విన్ పైలట్ ల్యాంప్స్, రియర్ వింటేజ్ టెయిల్ ల్యాంప్ వంటి మార్పులను ఈ కొత్త బైక్‌లో గమనించవచ్చు.

Click it and Unblock the Notifications