రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు సరికొత్త రంగుల్లో..

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా చెప్పుకునే మోటార్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తమ బ్రాండ్ లోగో, క్రెస్ట్, బ్యాడ్జ్ మరియు మోనోగ్రామ్‌లను మార్చిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మోటార్‌సైకిళ్ల కలర్లను మార్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, థండర్‌బర్డ్ రేంజ్ మరియు బుల్లెట్ ఎలక్ట్రా మోటార్‌సైకిళ్లు ఇప్పుడు కొత్త బాడీ కలర్లలో లభ్యమవుతాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 500 కోసం క్లాసిక్ టాన్ కలర్, క్లాసిక్ 350 కోసం లగూన్, యాష్ కలర్స్, థండర్‌బర్డ్ 350 మరియు 500 కోసం మెరైన్, లైట్నింగ్ కలర్స్ మరియు బుల్లెట్ ఎలక్ట్రా కోసం రెడ్ కలర్ ఆప్షన్లను కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టింది. కొత్త కలర్ల కోసం కస్టమర్లు ఎలాంటి అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదివరకటి ధరలకే ఇవి లభిస్తాయి.

Royal Enfield

అలాగే, ఈ మోడళ్లలో కేవలం కలర్ మార్పు తప్ప ఇంజన్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 350సీసీ, 500సీసీ యూనిట్ కన్సట్రక్షన్ ఇంజన్లనే ఉపయోగించారు. ఇదిలా ఉండగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం అందిస్తున్న 350-500సీసీ ఇంజన్లకు మధ్యలో ఓ కొత్త 400 ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ఇంజన్ పూర్తిగా కొత్తది కాదు, ప్రస్తుతం అందిస్తున్న 350సీసీ ఇంజన్‌కు రీబోర్డ్ వెర్షనే ఇది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, May 19, 2014, 13:25 [IST]
English summary
Royal Enfield recently gave itself a brand overhaul in the form of a new logo, crest, badges and monogram. The two-wheeler company clearly wasn't finished as it has now introduced its products in fresh new colours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+