రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో, క్రెస్ట్, మోనోగ్రామ్‌లలో మార్పులు

By Ravi

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు ఓ శుభవార్త..! ఇకపై రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తులు కొత్త లోగో, క్రెస్ట్ మరియు మోనోగ్రామ్‌తో లభ్యం కానున్నాయి. తమ బ్రాండింగ్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే దిశలో భాగంగా, కంపెనీ ఈ మార్పులు చేసింది. దాదాపు 60 ఏళ్ల కంపెనీ చరిత్రలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి సారిగా తమ బ్రాండ్ లోగోను మార్చడం విశేషం.

పురాతన లోగోలోని అంశాలు మిస్ కాకుండా, దానికి మోడిఫైడ్ వెర్షన్‌గా ఈ కొత్త లోగోను డిజైన్ చేశారు. ఈ కొత్త బ్రాండ్ ఐడెంటిటీ "స్ట్రైప్స్" (గీతలు) రాయల్ ఎన్‌ఫీల్డ్ పిలుస్తోంది రా.. అన్నట్లుంటాయి. కంపెనీ చరిత్రకు అద్దంపట్టేలా ఈ కొత్త లోగోను డిజైన్ చేశారు. ఇకనుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి రానున్న అన్ని ఉత్పత్తులపై ఈ కొత్త లోగోలు కనిపించనున్నాయి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో మారింది

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కొత్త లోగోలో కూడా రెడ్ అండ్ యల్లో (ఎరుపు, పసుపు రంగు) కలర్ థీమ్‌ను యధావిధిగా కొనసాగించనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో మారింది

కొత్త ‘RE' వింగ్ మోనోగ్రా డిజైన్‌లో కేవలం ‘R' అక్షరం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఇరువైపులా రెక్కల మాదిరిగా డిజైన్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో మారింది

కేనన్ (ఫిరంగి)తో కూడిన క్రెస్ట్‌లో ఎప్పటి మాదిరిగానే "Made like a gun, goes like a bullet" (గన్నులా తయారుచేయబడినది, బుల్లెట్‌లా దూసుకుపోతుంది) అనే కంపెనీ సిద్ధాంతాన్ని యధావిధిగా కొనసాగించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో మారింది

రాయల్ ఎన్‌ఫీల్డ్‌లోని ఇండివిడ్యువల్ టూవీలర్ బ్రాండ్స్ యొక్క బ్యాడ్జ్‌లు ఇకపై ఇలా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2014, 20:39 [IST]
English summary
Royal Enfield now has a new logo, a new crest and a new monogram, all of which are modified versions of its older form. The new brand identity "stripes" as Royal Enfield is calling them, continue to pay tribute to the company's heritage and history. Take a look at Royal Enfield's new "stripes" in the slides.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+