సల్మాన్ ఖాన్ కోసం అద్భుతమైన హ్యాండ్-క్రాఫ్టెడ్ సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను మరో అద్భుతమైన సుజుకి బైక్ వరించింది. ఇటీవల సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎమ్ఐఎల్) బెంగుళూరులో ప్రారంభించిన 'సుజుకి బైకింగ్ లార్డ్స్' అనే ప్రత్యేకమైన సూపర్‌బైక్ గ్రూప్ సందర్భంగా, కంపెనీ సల్మాన్ ఖాన్ కోసం ప్రత్యేకంగా చేతుల్తో తయారు చేసిన బ్లూ అండ్ వైట్ కలర్ 'సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్' బైక్‌ను ఆయనకు కానుకగా ఇచ్చింది.
సుజుకి ఇలా ప్రత్యేకంగా తయారు చేసిన అతికొద్ది బైక్‌లలో సల్మాన్ ఖాన్ వరించిన సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ (Suzuki GSX-R1000Z) ఒకటి. దీంతో భారతదేశంలో ఈ లిమిటెడ్ ఎడిషన్ సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ బైక్ కలిగి ఉన్న ఏకైక వ్యక్తిగా మన సల్లు భాయ్ నిలిచాడు. సల్మాన్ ఖాన్ వద్ద ఇప్పటికే సుజుకి హయబుసా సూపర్‌బైక్, సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800 క్రూయిజర్ బైక్‌లు ఉన్నాయి.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి బైక్ యజమానుల కోసం ఉద్దేశించిన 'సుజుకి బైకింగ్ లార్డ్స్' అనే ప్రత్యేకమైన సూపర్‌బైక్ గ్రూప్ ప్రారంభోత్సవం సందర్భంగా, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ 'సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్' బైక్‌ను సల్మాన్ ఖాన్‌కు కానుకగా ఇచ్చింది.

ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రైడ్ చేసిన అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. సుజుకి సూపర్‌బైక్స్ అంటేనే టెక్నాలజీ, పవర్, పెర్ఫామెన్స్, రైడ్ క్వాలిటీ మరియు హ్యాండ్లింగ్ విషయాలకు పెట్టింది పేరని, ఈ ఎక్స్‌క్లూజివ్ జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ బైక్ సుజుకి సూపర్‌బైక్స్ కిరీటంలో ఓ వజ్రం లాంటిదని అన్నారు.

ఇలాంటి ఓ బైక్‌ను కలిగి ఉండటం బైకర్లు చేసుకున్న అదృష్టమని, ఈ బైక్‌ను రైడ్ చేయటం చాలా థ్రిల్లింగ్ ఉందని, భవిష్యత్తులో ఈ స్పెషల్ ఎడిషన్ సూపర్‌బైక్‌పై అనేక లాంగ్ రైడ్‌లు వెళ్లేందుకు ప్లాన్ చేస్తానని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా మాట్లాడుతూ.. సల్మాన్ మరియు జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ ఒకరితో ఒకటి సరిగ్గా సరిపోతాయని, సల్మాన్ ఖాన్ సినీ పరిశ్రమలో సూపర్‌స్టార్ అయితే, సూపర్‌బైక్ సెగ్మెంట్లో జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ సూపర్‌స్టార్ అని ఆయన అన్నారు.

సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ బైక్ ఈ సెగ్మెంట్లోని ఇతర బైక్‌లో పోల్చడానికి సరిపోదని, చేతుల్తో తయారు చేసిన ఈ బైక్ అత్యంత విశిష్టమైనదని ఆయన తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు ఇలాంటి బైక్ ఇదొక్కటేనని, ఈ బైక్‌పై సల్మాన్ ఖాన్ మర్చిపోలేని రైడ్‌లను చేయాలని కోరుకుంటున్నానని అతుల్ గుప్తా చెప్పారు.


Click it and Unblock the Notifications








