వర్డెంచి కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించిన సమీరా రెడ్డి
ముంబైకి చెందిన కస్టమ్ బైక్ మేకర్ వర్డెంచి (Vardenchi) గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ఓ సరికొత్త మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను ప్రదర్శిచింది. ఇటీవలే వివాహం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి సమీరా రెడ్డి ఈ బైక్‌ను ఆవిష్కరించింది.
ఇటాలియన్ బైక్ కంపెనీ మోటో మోరినీ నుంచి గ్రహించిన 1187సీసీ, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించి కంపెనీ ఈ కాన్సెప్ట్ బైక్‌ను తయారు చేసింది. ఇందులో ట్రె్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది క్లాసిక్ క్రూయిజర్ డిజైన్ కన్నా మెరుగ్గా ఉంటుంది.
ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, వైడ్ హ్యాండిల్ బార్, విశిష్టమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్, బ్రెంబూ డిస్క్ బ్రేక్స్, మోర్జూచి ఫ్రంట్ ఇన్వెర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, ఓహ్లిస్ మోనోషాక్ సస్పెన్షన్, ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్, 200 మి.మీ రియర్ టైర్ అల్లాయ్ వీల్స్ (ఆప్షనల్ స్పోక్ వీల్స్) వంటి ఫీచర్లు ఈ వర్డెంచి మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ సొంతం.
ఈ బైక్ త్వరలోనే కాన్సెప్ట్ దశ నుంచి ఉత్పత్తి దశకు చేరుకోనుంది. ఈ బైక్‌ను నావీ ముంబైలోని వర్డెంచి మోటార్‌సైకిల్ ప్లాంట్లో తయారు చేయనున్నారు. భారత్‌లో ఇది ఎక్స్‌క్లూజివ్ డీలర్ల ద్వారా లభ్యం కానుంది. అలాగే ఈ బైక్‌ను యూరప్ మార్కెట్లలో మోటో మోరినీ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించనున్నారు.

వర్డెంచి కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటి సమీరా రెడ్డి.

వర్డెంచి కాన్సెప్ట్ బైక్‌తో బాలీవుడ్ నటి సమీరా రెడ్డి.

వర్డెంచి కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటి సమీరా రెడ్డి.

వర్డెంచి కాన్సెప్ట్ బైక్‌తో ఫొటోలకు ఫోజిలిస్తున్న బాలీవుడ్ నటి సమీరా రెడ్డి.

భర్త ఆకాషి వర్డెతో సమీరా రెడ్డి.


Click it and Unblock the Notifications








