స్కల్లీ ఏఆర్-1: అధునాత మోటార్‌సైకిల్ హెల్మెట్, ఫీచర్స్ అదుర్స్..

హెల్మెట్ అంటే కేవలం యాక్సిడెంట్స్ జరిగినప్పుడు తలకు దెబ్బ తగలకుండా ఉండేందుకు లేదా పోలీసుల జరిమానా బాధ నుంచి తప్పించుకునేందుకు మాత్రమే ఉపయోగించే వస్తువు అనేది ఒకప్పటి ట్రెండ్. కానీ, ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో హెల్మెట్లలో కూడా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి.

మొన్నామధ్య మనం బైక్ స్టార్ట్ చేయాలంటే హెల్మెట్ పెట్టుకొని తీరాల్సిందేనన టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం. అంతకు ముందు జిపిఎస్ హెల్మెట్ గురించి, దానికి ముందు వైపర్ హెల్మెట్ గురించి ఇలా కొత్త కొత్త టెక్నాలజీలతో తయారు చేసిన హెల్మెట్ల గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఈ కథనంలో మనం తెలుసుకోబోయే మరొ కొత్త హెల్మెట్ కూడా అధునాతన టెక్నాలజీతో తయారు చేయబడినది.

స్కల్లీ (Skully) అనే అంతర్జాతీయ హెల్మెట్ల తయారీ సంస్థ రూపొందించిన ఈ హెల్మెట్ పేరు 'స్కల్లీ ఏఆర్-1' (Skully AR-1). ఈ హెల్మెట్ స్పెషాలిటీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్కల్లీ ఏఆర్-1

తర్వాతి స్లైడ్‌లలో స్కల్లీ ఏఆర్-1 హెల్మెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

సినాప్స్ ఇంటిగ్రేటెడ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే

సినాప్స్ ఇంటిగ్రేటెడ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే

సినాప్స్ ఇంటిగ్రేటెడ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే టెక్నాలజీ ద్వారా స్కల్లీ ఏఆర్-1 హెల్మెట్ అడ్వాన్స్డ్ సిచ్యువేషనల్ అవేర్‌నెస్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది నావిగేషన్, బ్లైండ్ స్పాట్ డేటాను ముందున్న విజర్‌పై అందిస్తుంది. ఫలితంగా మీరు మీ తలను పక్కకు తిప్పాల్సిన అసరం లేకుండానే, రోడ్డుపై దృష్టి సారించి సురక్షితంగా ముందుకు సాగిపోవచ్చు.

18 డిగ్రీ రియర్ వ్యూ కెమెరా

18 డిగ్రీ రియర్ వ్యూ కెమెరా

సాధారణంగా మోటార్‌సైకిళ్లను రైడ్ చేస్తున్నప్పుడు వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూడాలంటే, సైడ్ మిర్రర్ల వైపు చూస్తాం. కానీ ఇందులో బ్లైండ్ స్పాట్‌లో ఉండే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుకే స్కల్లీ ఏఆర్-1 హెల్మెట్ వెనుక వైపు 180 డిగ్రీల కోణంలో చూపించే కెమరాను అమర్చారు. ఈ కెమెరా మోటారిస్ట్ వెనుక వచ్చే వాహనాల విజువల్స్‌ను ముందున్న విజర్‌పై ఓ మూలభాగంలో ప్రొజెక్ట్ చేస్తుంది. దీని వలన వెనుక వచ్చే వాహనాల గురించి రైడర్‌కు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.

జిపిఎస్ మ్యాపింగ్

జిపిఎస్ మ్యాపింగ్

ఇందులోని స్కల్లీ నావ్ అనే నావిగేషన్ సిస్టమ్ మీ ప్రయాణానికి మార్గదర్శకం చేస్తుంది. మీరు వెళ్లాలనుకున్న రూట్‌ను, వెళ్తున్న రూట్‌ను ఇది జిపిఎస్ ద్వారా చూపిస్తుంది. దీని వలన మీరు కొత్త రూట్లలో ప్రయాణిస్తున్నప్పుడ దారితప్పిపోయే ప్రమాదం ఉండదు.

స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్

స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్

ఈ స్కల్లీ ఏఆర్-1 హెల్మెట్‌ను మీ స్మార్ట్‌‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. హెల్మెట్‌లో ఉండే బ్లూటూత్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. మీ వాయిస్ ద్వారా ఈ హెల్మెట్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు, మెసేజ్‌లు పంపించవచ్చు, ఫోన్‌కాల్స్ చేయవచ్చు, చేతి సాయం అవసరం లేకుండానే మీ గమ్యాన్ని మార్చుకోవచ్చు.

కీలక ఫీచర్లు

కీలక ఫీచర్లు

* తేలికైనది, ఏరోడైనమిక్ షెల్ కలిగినది

* ఫర్‌ఫెక్ట్ ఫిట్ కోసం3డి లేజర్-కట్ ఫోమ్

* అడ్డస్టబల్ వెంటిలేషన్

* యాంటీ-ఫాగ్, యాంటీ-స్క్రాచ్, యాంటీ-గ్లేర్ ఫేస్ షీల్డ్ (విజర్)

* క్విక్ రిలీజ్ చిన్ స్ట్రాప్ అండ్ విజర్

* వాయిస్ కంట్రోల్‌తో కూడిన స్కల్లీ సినాప్స్ హెడ్స్ అప్ డిస్‌ప్లే సిస్టమ్

* విజువల్ జిపిఎస్ నావిగేషన్

* 180 డిగ్రీ వైడ్ యాంగిల్ రియర్ వ్యూ కెమెరా

* స్మార్ట్‌ఫోన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ

* స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ

వీడియో

స్కల్లీ ఏఆర్-1 హెల్మెట్ పనితీరును చూపించే వీడియోని ఈ స్లైడ్‌లో వీక్షించండి. తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని హెల్మెట్ స్టోరీలను చూడండి.

హెల్మెట్ ప్రయోజనాలు

హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు

బైక్ స్టార్ట్ చేయాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి

హెల్మెట్ ధరిస్తేనే బైక్ స్టార్ అవుతుంది, ఇదెట్టా సాధ్యం?

తెలుసుకోవటం కోసం పై లింక్‌పై క్లిక్ చేయండి.

నావిగేషన్ లైవ్‌మ్యాప్ హెల్మెట్

జిపిఎస్ ఆధారిత హెల్మెట్ గురించి తెలుసుకోండి

తెలుసుకోవటం కోసం పై లింక్‌పై క్లిక్ చేయండి.

వైపర్ హెల్మెట్

వైపరుతో కూడిన హెల్మెట్ గురించి తెలుసుకోండి

తెలుసుకోవటం కోసం పై లింక్‌పై క్లిక్ చేయండి.

ఫన్నీ హెల్మెట్స్

ఇవి కూడా చూడండి: ఫన్నీ హెల్మెట్స్

More from DriveSpark

Article Published On: Tuesday, July 8, 2014, 10:55 [IST]
English summary
The Silicon Valley based company Skully Helmets has created a motorcycle helmet that plenty of modern technological features. The Skully AR-1 is an augmented reality motorcycle helmet. Take a look.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+