స్ట్రీట్ 750 రాకతో పుంజుకున్న హ్యార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలు

అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హ్యార్లీ డేవిడ్‌సన్, గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. ఏకమొత్తంగా ఈ బైక్‌‌ను కొనుగోలు చేయలేని హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రియుల కోసం ఓ సరికొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా పరిచయం చేయటంతో, ఈ మోడల్ అమ్మకాలు మరింత పుంజుకున్నాయి.

ఇది కూడా చదవండి: హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 కోసం ఈఎమ్ఐ స్కీమ్

గడచిన ఏప్రిల్ 2014 నెలలో కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 60 శాతం అమ్మకాలు స్ట్రీట్ 750 బైక్‌లే ఉన్నాయంటే, ఈ మోడల్ ఎంతటి సక్సెస్‌ను సాధించిందో ఇట్టే అర్థమైపోతుంది. దేశీయ విపణిలో హ్యార్లీ డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 బైక్ ధర రూ.4.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మార్చ్ 1, 2014వ తేది నుంచి ఈ మోడల్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించారు.

HD Street 750

భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2014లో హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా మొత్తం 361 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, అందులో 210 యూనిట్లు స్ట్రీట్ 750 మోడళ్లే ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో (ఏప్రిల్ 2013లో) హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా మొత్తం విక్రయాలు 146 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి.

ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ భారత మార్కెట్లో స్ట్రీట్ 750 మోడల్‌తో కలిపి మొత్తం 13 మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.4.1 లక్షల నుంచి రూ.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. కాగా.. గడచిన నెలలో హ్యార్లీ డేవిడ్‌సన్ మొత్తం 506 స్ట్రీట్ 750 బైక్‌‌లను ఉత్పత్తి చేసింది. న్యూఢిల్లీ, చండీఘడ్, ముంబై, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, అహ్మదాబాద్, ఇండోర్, పూనే, గోవా, జైపూర్‌లలో కంపెనీకి మొత్తం 13 డీలర్‌షిప్‌ కేంద్రాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 12, 2014, 10:35 [IST]
English summary
Iconic cult bike maker Harley-Davidson has hit the sweet spot with its model 'Street 750', that is built in India, accounting for nearly 60 per cent of its April sales in the country within the first month of starting deliveries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+