బ్యాటరీ, పెట్రోల్ పవర్‌తో నడిచే హైబ్రిడ్ బైక్‌ను తయారు చేసిన విద్యార్థులు
హీరో మోటోకార్ప్ ఇటీవల డీజిల్ ఇంధనంతో నడిచే ఆర్ఎన్‌టి అనే కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఇందులో వెనుక చక్రం డీజిల్ ఇంజన్‌తో నడిస్తే, ముందు చక్రంలోని వీల్ హబ్‌లో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. దీంతో ఇదొక టూవీల్ డ్రైవ్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌గా అవతరించింది.
ఇదే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మంగుళూరులోని కారావళి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఓ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఆఖరి సంవత్సరం చదువుతున్న సుబిన్ డానియేల్ థంపి, అంజు ఇసాక్ అనే ఇద్దరు విద్యార్థులు తమ బి.ఈ. ప్రాజెక్టులో భాగంగా ఈ బైక్‌ను తయారు చేశారు.

పాత హీరో హోండా సిడి100 మోటార్‌సైకిల్‌ను మోడిఫై చేసి టూవీల్ డ్రైవ్ మోటార్‌సైకిల్‌గా తయారు చేశారు. పి. రమేష్ కుమార్ గైడెన్స్‌లో ఈ ఇద్దరు విద్యార్థులు టూవీల్ డ్రైవ్ బైక్‌ను డెవలప్ చేశారు. ఇందులో ఫ్రంట్ వీల్‌లో ఓ 550వాట్ హబ్ మోటార్‌ను అమర్చారు. ఈ మోటార్ బైక్‌కు అమర్చిన బ్యాటరీ సాయంతో నడుస్తుంది.
ఇందులోని ఆల్టర్నేటర్ సాయంతో ఐసి ఇంజన్ ద్వారా బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ హైబ్రిడ్ బైక్ కేవలం ఫ్రంట్ వీల్‌లో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ సాయంతో గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో దాదాపు 45 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ చార్జ్ అయిపోతే, పెట్రోల్ ఇంజన్‌తో బైక్‌ను నడపవచ్చు. ఇలా నడుపుతున్న ఆ ఇంజన్ జనరేటర్‌లా పనిచేసి బ్యాటరీని చార్జ్ చేస్తుంది. బాగుంది కదూ ఈ హైబ్రిడ్ బైక్.


Click it and Unblock the Notifications








