ఎస్ఈపి టెక్నాలజీతో సుజుకి స్విష్, యాక్సెస్ స్కూటర్స్!
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తాజాగా ప్రవేశపెట్టిన తమ సరికొత్త 110సీసీ స్కూటర్ 'సుజుకి లెట్స్' (Suzuki Let's)ను ఎస్ఈపి (సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్) టెక్నాలజీతో పరిచయం చేసిన సంగతి తెలిసినదే. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని కంపెనీ అందిస్తున్న స్విష్, యాక్సెస్ 125సీసీ స్కూటర్లతో పాటుగా కొన్ని మోటార్‌సైకిళ్లలో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుజుకి ఈకో పెర్ఫామెన్స్ (ఎస్ఈపి) టెక్నాలజీ ప్రస్తుతం హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది. టెక్నికల్‌గా చెప్పలంటే, దీనిని ఓ టెక్నాలజీ అనేదాని కన్నా ఇంజన్ మోడిఫికేషన్ అనొచ్చు.

బెంగుళూరులో సుజుకి లెట్స్ స్కూటర్‌ను విడుదల చేసిన సందర్భంగా, మా డ్రైవ్‌స్పార్క్ ప్రతినిధి ఒకరు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించగా, ఆయన సూచనప్రాయంగా సమాధానమిచ్చారు.
ఇక సుజుకి లెట్స్ విషయానికి వస్తే.. ఇందులో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, సుజుకి లెట్స్ స్కూటర్ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.


Click it and Unblock the Notifications








