సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ కోసం బుకింగ్‌లు ప్రారంభం!

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కిరంచిన కొత్త 110సీసీ స్కూటర్ సుజుకి లెట్స్ (Suzuki Let's)ను ఈ నెలాఖరు నాటికి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుజుకి టూవీలర్ డీలర్లు లెట్స్ స్కూటర్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు సమాచారం.

సుజుకి లెట్స్ స్కూటర్‌ను ప్రత్యేకించి నేటి యువతను (18-25 ఏళ్ల వయస్సు కలిగిన వారిని) లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఇది ఈ సెగ్మెంట్లో హోండా యాక్టివా, హీరో ప్లెజర్ వంటి స్కూటర్లకు పోటీగా నిలవనుంది. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి ఇది మొట్టమొదటి 110సీసీ స్కూటర్ కావటం విశేషం. ప్రస్తుతం సుజుకి ఆఫర్ చేస్తున్న యాక్సిస్, స్విష్ స్కూటర్లు 125సీసీ ఇంజన్‌తో లభిస్తున్నాయి.


సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

సుజుకి లెట్స్ స్కూటర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.


కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, సుజుకి లెట్స్ స్కూటర్‌ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్‌కు లోబడి). సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను అలాగే వెనుక వైపు స్వింగ్ఆర్మ్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు అలాగే వెనుక వైపు 120 మి.మీ. డయా డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి లెట్స్ స్కూటర్‌ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 90/100-10, వెనుక టైరు సైజ్ 90/100-10. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ మిరా రెడ్, మెటాలిక్ ట్రైటన్ బ్లూ, పెరల్ మిరేజ్ వైట్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్) లభ్యం కానుంది.

Suzuki Lets Rear Profile

సుజుకి లెట్స్ స్కూటర్ 1810 మి.మీ. పొడవును, 660 మి.మీ. వెడల్పును, 1120 మి.మీ. ఎత్తును, 1250 మి.మీ. వీల్‌బేస్‌ను, 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు 765 మి.మీ. సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 98 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, April 21, 2014, 10:46 [IST]
English summary
Suzuki had revealed their new 110cc automatic scooter at the Auto Expo held in Greater Noida, Delhi in February 2014. The Japanese automobile manufacturer christened their scooter the Let's. They plan to launch the scooter during the end of this month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+