బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల; ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఈనెల 9వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 150సీసీ మోటార్‌సైకిల్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer)ను శుక్రవారం (సెప్టెంబర్ 19, 2014) నాడు బెంగుళూరు మార్కెట్లో మార్కెట్లో విడుదల చేసింది.

బెంగుళూరు మార్కెట్లో సుజుకి జిక్సర్ ధరను రూ. 74,552 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా నిర్ణయించారు. స్ట్రీట్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా పిలిచే ఈ బైక్ పేరును కంపెనీ విక్రయిస్తున్న స్పోర్ట్స్ బైక్ జిఎస్ఎక్స్-ఆర్ (GSX-R) నుంచి స్ఫూర్తి పొంది పెట్టినట్లు కంపెనీ పేర్కొంది.

సుజుకి అందిస్తున్న పవర్‌ఫుల్ జిఎస్ఎక్స్-ఆర్ మోటార్‌సైకిళ్లను నడిపే వారిని 'జిక్సర్స్' అని పిలుస్తారని, ఆ పేరు నుంచి స్ఫూర్తి పొందే తమ 150సీసీ బైక్‌కు జిక్సర్ అనే పేరును పెట్టామని, తాము ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్న పెద్ద మోటార్‌‌సైకిళ్లలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని జిక్సర్‌ను డిజైన్ చేశామని సుజుకి వివరించింది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్‌కి సంబంధించిన మరింత సమచారం తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

స్ట్రీట్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా పిలిచే సుజుకి జిక్సర్ 150సీసీ బైక్‌ను, కంపెనీ విక్రయిస్తున్న పవర్‌ఫుల్ 1000సీసీ బైక్ జిఎస్ఎక్స్-ఆర్1000 నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో 154.9సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 14.8 పిఎస్‌ల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

సుజుకి జిక్సర్ డిజైన్‌ను గమనిస్తే, దీని హెడ్‌‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకు ప్రతి డిజైన్ ఎలిమెంట్ కూడా ఎంతో స్టయిలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇది స్మార్ట్ ఫోన్ మాదిరిగా స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. రియర్ సస్పెన్షన్‌ను 7-విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైడర్ సౌకర్యాన్ని బట్టి ఈ సస్పెన్షన్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ గ్రాబ్ రెయిల్స్, ట్విన్ ఎగ్జాస్ట్స్ మొదలైనవి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఇతర ఫీచర్లు. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

బెంగుళూరులో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

బెంగుళూరు మార్కెట్లో సుజుకి జిక్సర్ 150సీసీ మోటార్‌సైకిల్ ధర రూ. 74,552 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉంది.

Most Read Articles

English summary
Crafted by the engineers of the legendary Suzuki GSX-R Series, the dream has finally reached its culmination - the Suzuki GIXXER is here!! The GIXXER was launched today by Suzuki Motorcycle India Private Limited (SMIPL), a subsidiary of one of the world’s leading two-wheeler manufacturers, Suzuki Motor Corporation, Japan. 
Story first published: Friday, September 19, 2014, 17:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X