హైదరాబాద్‌లో సుజుకి జిక్సర్ బైక్ విడుదల

By Ravi

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, ఈనెల 9వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 150సీసీ మోటార్‌సైకిల్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer)ను బుధవారం(సెప్టెంబర్ 17, 2014) నాడు హైదరాబాద్ మార్కెట్లో విడుదలైంది. రాష్ట్ర మార్కెట్లో దీని ధర రూ. 74,552 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. ఈ మోడల్‌ను సుజుకి స్ట్రీట్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా పిలుస్తోంది.

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిలో 154.9సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

Suzuki Gixxer

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది.

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ గ్రాబ్ రెయిల్స్, ట్విన్ ఎగ్జాస్ట్స్ మొదలైనవి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఇతర ఫీచర్లు. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 150సీసీ బైక్ సుజుకి జిఎస్150ఆర్‌కు ఎగువన దీనిని ప్రవేశపెట్టనున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2014, 11:17 [IST]
English summary
Suzuki Motorcycle India Limited (SMIL) has launched its brand new 155cc motorcycle - Gixxer in Hyderabad. Clearly a play on the name GSX-R, the company's flagship sports bike, Suzuki says the new Gixxer has been developed using the experience gained from the liter class motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+