సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ నేడు రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. అందులో ఒకటి 150సీసీ సెగ్మెంట్ బడ్జెట్ స్పోర్ట్స్ బైక్ 'సుజుకి జిక్సర్'. ఈ కథనంలో సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి..!

ప్రత్యేకించి యువతను లక్ష్యంగా చేసుకొని సుజుకి తమ జిక్సర్ బైక్‌ను అభివృద్ధి చేసింది. ఈ సెగ్మెంట్లో హీరో హంక్, హోండా సిబి ట్రిగ్గర్ వంటి 150సీసీ బైక్‌లను టార్గెట్ చేస్తూ సుజుకి తమ జిక్సర్ బైక్‌ను ప్రవేశపెట్టింది. సుజుకి అందిస్తున్న జిఎస్ఎక్స్-ఆర్ 1000సీసీ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త సుజుకి జిక్సర్‌ను డెవలప్ చేశారు.

సుజుకి జిక్సర్ 155సీసీ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్‌లో 155సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

దేశీయ విపణిలో సుజుకి జిక్సర్ ధర సుమారు రూ.75,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్ అమ్మకాలు జులై 2014 నుంచి వాణిజ్యం పరంగా ప్రారంభం కానున్నాయి.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ హీరో, సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్

సుజుకి జిక్సర్ మోటార్‌సైకిల్‌తో బాలీవుడ్ హీరో, సుజుకి మోటార్‌సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ సల్మాన్ ఖాన్ మరియు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఉన్నతాధికారులు.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2014, 15:45 [IST]
English summary
Suzuki Motorcycle India Limited (SMIL) has unveiled a brand new 155cc motorcycle - Gixxer. Clearly a play on the name GSX-R, the company's flagship sports bike, Suzuki says the new Gixxer has been developed using the experience gained from the liter class motorcycle. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+