Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏప్రిల్ 7న సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ బైక్ విడుదల!
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో మార్కెట్లో విడుదల సరికొత్త 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer) 150సీసీ నేక్డ్ స్ట్రీట్ బైక్‌కు కొనసాగింపుగా కంపెనీ ఇందులో ఓ సెమీ ఫెయిర్డ్ స్పోర్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం.
కాగా.. కంపెనీ ఇప్పుడు ఆ వార్తను నిజం చేస్తూ 'సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్' (Suzuki Gixxer SF) పేరిట ఓ స్పోర్ట్స్ బైక్‌ను వచ్చే నెల ఆరంభంలో విడుదల చేయనుంది. (ఈ పేరులో బహుశా ఎస్ఎఫ్ అంటే సెమీ ఫెయిర్డ్ అని అర్థం కావచ్చు).
సుజుకి జిస్కర్ సూపర్‌బైక్‌లను తలపించే విశిష్టమైన స్టయిలింగ్, ఆకర్షనీయమైన డిజైన్, సాటిలేని పెర్ఫార్మెన్స్‌లతో జిక్సర్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్‌లో కూడా అదే 150సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

ఇందులో 154.9సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. జిక్సర్ ఎస్ఎఫ్‌లో కూడా ఈ టెక్నాలజీని కొనసాగించే అవకాశం ఉంది. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది.
ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది. సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు.