సుజుకి హయబుసా జెడ్ విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్, భారత మార్కెట్లో అందిస్తున్న పవర్‌ఫుల్ సూపర్‌బైక్ 'హయబుసా'లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. సుజుకి హయబుసా జెడ్ పేరుతో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ రెండు విభిన్న రంగులలో లభ్యం కానుంది దేశీయ విపణిలో ఈ బైక్ ధరను రూ.16.20 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.
సుజుకి హయబుసా జెడ్ ఇంజన్:
సుజుకి హయబుసా జెడ్ స్పెషల్ ఎడిషన్ బైక్‌లో పవర్‌ఫుల్ 1340సీసీ, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పిల శక్తిని, 155 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 11 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

సుజుకి హయబుసా జెడ్ ఫీచర్సు:
- సెలక్టబల్ ఇంజన్ మ్యాపింగ్
- సుజుకి డ్రైవ్ మోడ్ సెలక్టర్
- ఫోర్జ్డ్ పిస్టన్స్
- పివిడి కోటెడ్ రింగ్స్
- సుజుకి డ్యూయెల్ థ్రోటల్ వాల్వ్
- బ్రెంబూ మోనోబ్లాక్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్
- లైట్‌వెయిట్ అండ్ హైపెర్ఫార్మెన్స్ ఏబిఎస్
- ఎగ్జాస్ట్‌పై యోషిమురా ఆర్77జె స్లిప్
సుజుకి హయబుసా జెడ్ కలర్స్:
- పెరల్ బ్రేసింగ్ వైట్ విత్ మెటాలిక్ మిస్టిక్ సిల్వర్
- పెరల్ విగోర్ బ్లూ విత్ మెటాలిక్ మిస్టిక్ సిల్వర్


Click it and Unblock the Notifications








