సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 విడుదల; ధర, ఫీచర్లు

By Ravi

ఎట్టకేలకు సుజుకి 250సీసీ బైక్ 'ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250) భారత మార్కెట్లో విడుదలయ్యింది. సోమవారం నాడు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ తమ సరికొత్త 250సీసీ బైక్‌ను భారత్‌కు పరిచయం చేసింది.

జపనీస్ భాషలో 'ఇనాజుమా' అంటే తుఫాను సమయంలో వచ్చే భారీ 'మెరుపు' అని అర్థం. ఈ పేరుకు సార్థకత కల్పించేలా తమ ఇనాజుమాను డిజైన్ చేశామని, ఇందులోని శక్తివంతమైన 250సీసీ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇందులో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 బైక్‌ ధరను మరియు ఈ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో వీడియోని వీక్షించడం మర్చిపోకండి..!

ఇంజన్

ఇంజన్

సుజుకి ఇనాజుమాలో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

సికెడి అసెంబ్లింగ్

సికెడి అసెంబ్లింగ్

సుజుకి ఇనాజుమా 250 లేదా జిడబ్ల్యూ 250గా ఈ పిలిచే ఈ బైక్‌ను విదేశాల నుంచి విడిభాగాల రూపంలో దిగుమతి (సికెడి-కంప్లీట్లీ నాక్డ్ డౌన్ రూట్లో) చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు.

ధర

ధర

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 బైక్‌ను భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తున్న కారణంగా, ఈ బైక్‌ను సరసమైన ధరకే కంపెనీ విక్రయించనుంది. మార్కెట్లో దీని ధరను రూ.3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

డిజైన్, ఫీచర్స్

డిజైన్, ఫీచర్స్

ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది.

కాంపిటీషన్

కాంపిటీషన్

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇది నలుపు, ఎరుపు రంగులలో మాత్రమే లభిస్తుంది.

వీడియో

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 పెర్ఫామెన్స్ వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

 
English summary
Suzuki Motorcycle India Limited (SMIL), a subsidiary of one of the world’s leading two-wheeler manufacturers Suzuki Motor Corporation, Japan, today launched the 250 cc Suzuki Inazuma. The Suzuki Inazuma is available in two colours - black & red and is priced at Rs. 3,10,121 (ex-showroom, New Delhi)
Please Wait while comments are loading...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+