రిఫ్రెష్డ్ 2014 సుజుకి హయాటే బైక్ విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గడచిన మే 2014లో భారత మార్కెట్లోకి విడుదల చేసిన తమ బడ్జెట్ బైక్ 'సుజుకి హయాటే'లో కంపెనీ తాజాగా ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండంతో, దీని అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేసిన కొత్త 2014 హయాటేను కంపెనీ విడుదల చేసింది.

ఇదివరకటి హయాటేతో పోల్చుకుంటే కొత్త రిఫ్రెష్డ్ హయాటేలో కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా, పాత హయాటే సైడ్ బాడీ ప్యానెల్స్ బ్లాక్ ప్లాస్టిక్‌తో మాత్రమే లభించేవి. కాగా, ఈ కొత్త 2014 సుజుకి హయాటే సైడ్ బాడీ ప్యానెల్స్ గ్లాసీ ఫినిషింగ్‌తో లభిస్తాయి. అకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌ను ఇందులో చూడొచ్చు. అలాగే, యాంత్రిక పరంగా కూడా కొత్త సుజుకి హయాటేలో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి.


కొత్త సుజుకి హయాటేలో 112.8సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. స్మూత్ రైడ్, బెటర్ మైలేజ్ కోసం ఈ ఇంజన్‌ను ఫైన్ ట్యూన్ చేశారు, అలాగే కార్బురేటర్ సెట్టింగ్స్‌ను ఇంప్రూవ్ చేశారు. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రింది వైపుకు)తో లభిస్తుంది. ఇందులో 5-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి హయాటే కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని మొత్తం బరువు 112 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్లు, మైలేజ్ 70 కి.మీ. ఇందులో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్ (షాషీ)కు ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెషన్, వెనుక వైపు 5-వే అడ్జస్టబల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌లను అమర్చారు.

2014 Suzuki Hayate

ఇంకా ఇందులో మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, వెడల్పు రిమ్స్‌తో కూడిన ట్యూబ్‌లెస్ టైర్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. కొత్త 2014 సుజుకి హయాటే నేటి నుంచే (సెప్టెంబర్ 3, 2014) మార్కెట్లో లభ్యం కానుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.44,969 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఇది ఐదు ఆకర్షనీయమైన రంగులలో (గ్లాస్ స్పార్కల్ బ్లాక్-రెడ్ గ్రాఫిక్స్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్-బ్లూ గ్రాఫిక్స్, పెరల్ మిరాజ్ వైట్, పెరల్ మిరా రెడ్/గ్లాస్ స్పార్కల్ బ్లాక్, పెరల్ మూన్ స్టోన్ గ్రే) లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 3, 2014, 18:02 [IST]
English summary
Suzuki Motorcycle India Private Limited (SMIPL) today launched the new generation Hayate. The bestselling motorcycle from Suzuki India, Hayate comes with many radical changes, focused on attractiveness, convenience, and smoother ride it offers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+