యూకేలో స్పెషల్ ఎడిషన్ సుజుకి ఇనాజుమా

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ గడచిన జనవరి నెలలో తమ సరికొత్త 250సీసీ బైక్ 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250'ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ మోడల్ దేశీయ మార్కెట్లో ఆశించిన రీతిలో అమ్ముడుపోకపోవటంతో, కంపెనీ దీని ధరలో సుమారు లక్ష రూపాయల వరకూ తగ్గించింది.

విడుదల సమయంలో రూ.3.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉన్న దీని ధరను ప్రస్తుతం రూ.2.14 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, పూనే)లకు తగ్గించింది. సుజుకి ఇనాజుమా బైక్ ఇండియాలో అంత పాపులర్ కాకపోయినప్పటికీ యూకే మార్కెట్లో మాత్రం ఇది మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు కంపెనీ ఇందులో స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.


ఇనాజుమా 250జెడ్ పేరిట కంపెనీ ఈ మోడళ్లను యూకేలో విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లలోనే లభ్యం కానున్నప్పటికీ, త్వరలోనే భారత మార్కెట్లో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరికొత్త పెయింట్ స్కీమ్ మరియు ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ లభిస్తోంది. ఇందులో యాత్రికంగా ఎలాంటి మార్పు లేదు.

సుజుకి ఇనాజుమాలో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. సుజుకి ఇనాజుమా బైక్‌ను విదేశాల నుంచి విడిభాగాల రూపంలో ఇండియాకు దిగుమతి (సికెడి - కంప్లీట్లీ నాక్డ్ డౌన్ రూట్లో) చేసుకొని, స్థానిక మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తున్నారు.

Inazuma 250Z

ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది.సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 15, 2014, 9:07 [IST]
English summary
Suzuki has just launched its first quarter-litre motorcycle in India. The Inazuma has distinctive styling and buyers will either love it or hate it. The motorcycle when launched had a hefty price tag, however, recently the Japanese manufacturer has reduced the pricing, making it value for money.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+