భారత్‌లో సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్

By Ravi

జపనీస్ టూవీలర్ దిగ్గజం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న లీజర్ బైక్ 'సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్'లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. 'ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్' (Intruder M1800R B.O.S.S Edition) పేరిట సుజుకి ప్రవేశపెట్టిన ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ డ్యూయెల్ టోన్ కలర్ (యల్లో బ్లాక్ పెయింట్)తో లభిస్తుంది.

సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్‌లో ఇంజన్, ఎగ్జాస్ట్ (సైలెన్సర్), 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ బ్లాక్ ఫినిష్‌లో లభిస్తాయి. ఇందులో ఇంజన్ పరంగా ఎలాంటి అప్‌గ్రేడ్స్ లేవు, కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే. రెగ్యులర్ వెర్షన్ సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌లో ఉపయోగించిన 1783సీసీ, వి-ట్విన్, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు.

భారత మార్కెట్లో సుజుకి ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్ ధర రూ.16.45 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. స్టాండర్డ్ ఇంట్రుడర్ ఎమ్1800ఆర్‌తో పోల్చుకుంటే దీని ధర సుమారు రూ.50,000 అధికం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సుజుకి డీలర్‌షిప్ కేంద్రాల్లో ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్ అందుబాటులో ఉంటుంది.

Suzuki Intruder M1800R BOSS Edition

Article Published On: Monday, October 21, 2013, 14:34 [IST]
English summary
Japanese two-wheeler major Suzuki Motorcycle has launched the special edition Intruder M1800R B.O.S.S edition in India. This special edition Intruder is priced at Rs16.45 lakh (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+