సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల: ఫీచర్లు, వివరాలు

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ నేడు భారత్‌లో ఆవిష్కరించిన రెండు సరికొత్త ఉత్పత్తులలో, కొత్త 110సీసీ స్కూటర్ సుజుకి లెట్స్ (Suzuki Let's) కూడా ఒకటి. సుజుకి స్కూటర్స్ బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటీమణి పరిణీతి చోప్రా ఈ స్కూటర్‌ను న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కథనంలో సుజుకి లెట్స్ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి..!

ప్రత్యేకించి యువతను (18-25 ఏళ్ల వయస్సు కలిగిన వారిని) లక్ష్యంగా చేసుకొని సుజుకి తమ లెట్స్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఈ సెగ్మెంట్లో ఇది హోండా యాక్టివా, హీరో ప్లెజర్ వంటి స్కూటర్లకు పోటీగా నిలబడనుంది. అంతేకాకుండా, సుజుకికి ఇది మొట్టమొదటి 110సీసీ బైక్ కావటం విశేషం. ప్రస్తుతం సుజుకి ఆఫర్ చేస్తున్న యాక్సిస్, స్విష్ స్కూటర్లు 125సీసీ ఇంజన్‌తో లభిస్తున్నాయి.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, సుజుకి లెట్స్ స్కూటర్‌ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్‌కు లోబడి).

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను అలాగే వెనుక వైపు స్వింగ్ఆర్మ్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు అలాగే వెనుక వైపు 120 మి.మీ. డయా డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 90/100-10, వెనుక టైరు సైజ్ 90/100-10.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ మిరా రెడ్, మెటాలిక్ ట్రైటన్ బ్లూ, పెరల్ మిరేజ్ వైట్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్) లభ్యం కానుంది.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్ 1810 మి.మీ. పొడవును, 660 మి.మీ. వెడల్పును, 1120 మి.మీ. ఎత్తును, 1250 మి.మీ. వీల్‌బేస్‌ను, 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు 765 మి.మీ. సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 98 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సుజుకి లెట్స్ స్కూటర్ ధరను వెల్లడించనున్నారు. వాణిజ్యం పరంగా దీని అమ్మకాలు ఫిబ్రవరిలోనే ప్రారంభం కానున్నాయి.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌ను ఆవిష్కరిస్తున్న బాలీవుడ్ నటీమణి, సుజుకి స్కూటర్స్ బ్రాండ్ అంబాసిడర్ పరిణీతి చోప్రా.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

సుజుకి లెట్స్ స్కూటర్‌ ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బాలీవుడ్ నటీమణి, సుజుకి స్కూటర్స్ బ్రాండ్ అంబాసిడర్ పరిణీతి చోప్రా.

సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

ఫొటోలకు ఫోజిలిస్తున్న బాలీవుడ్ నటీమణి, సుజుకి స్కూటర్స్ బ్రాండ్ అంబాసిడర్ పరిణీతి చోప్రా.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2014, 17:03 [IST]
English summary
Suzuki Let's is the Japanese two wheeler manufacturer's new scooter model for the Indian market. Up till now Suzuki's scooter lineup consisted of the Access and Swish, both 125cc segment models. Let's is the company's first entry into the more popular 110cc segment and is a direct Activa i competitor.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+