భారత్‌లో ఇనాజుమా బైక్‌ను విడుదల చేయనున్న సుజుకి
జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ భారత మార్కెట్లో మరొక సరికొత్త సూపర్‌బైక్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250) మోటార్‌సైకిల్‌ను ఈ ఏడాది మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేకించి సంపన్న వర్గాలను మరియు స్పీడ్, స్టయిల్‌ను కోరుకునే ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని సుజుకి మోటార్‌సైకి ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. నేక్డ్ స్టయిలింగ్ కలిగిన ఈ స్ట్రీట్ ఫైటర్ బైక్‌ను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయటం ద్వారా సరసమైన ధరకే దీనిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 బైక్‌ను విదేశాల నుంచి విడిభాగాల రూపంలో దిగుమతి (సికెడి రూట్లో) చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. దీని పేరుకు తగినట్లుగానే ఇందులో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.
ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ధర విషయానికి వస్తే రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250 వంటి మోడళ్లకు సవాలుగా నిలువనుంది.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250



Click it and Unblock the Notifications








