లక్ష రూపాయలు తగ్గిన సుజుకి ఇనాజుమా 250 ధర

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ గడచిన జనవరి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 250సీసీ బైక్ 'సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250' (Suzuki Inazuma GW 250) ధరలో కంపెనీ భారీకోత విధించింది.

విడుదల సమయంలో సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ధర రూ.3.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉండేది. అయితే, ఇది ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర 250సీసీ బైక్‌ల కన్నా అధిక ధర కలిగి ఉండటంతో దీనికి డిమాండ్ భారీగా తగ్గిపోయింది.

ఈ నేపథ్యంలో, సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 డిమాండ్‌ను పెంచుకునేందుకు కంపెనీ దీని ధరలో సుమారు లక్ష రూపాయల వరకు కోత విధించింది. సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఇప్పుడు కేవలం రూ.2.14 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, పూనే) లభ్యం కానుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సుజుకి ఇనాజుమా 250 ధర తగ్గింపు

జపనీస్ భాషలో 'ఇనాజుమా' అంటే తుఫాను సమయంలో వచ్చే భారీ 'మెరుపు' అని అర్థం. ఈ పేరుకు సార్థకత కల్పించేలా తమ ఇనాజుమాను డిజైన్ చేశామని, ఇందులోని శక్తివంతమైన 250సీసీ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

సుజుకి ఇనాజుమా 250 ధర తగ్గింపు

సుజుకి ఇనాజుమాలో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

సుజుకి ఇనాజుమా 250 ధర తగ్గింపు

సుజుకి ఇనాజుమా 250 లేదా జిడబ్ల్యూ 250గా ఈ పిలిచే ఈ బడ్జెట్ స్పోర్ట్స్ బైక్‌ను విదేశాల నుంచి విడిభాగాల రూపంలో ఇండియాకు దిగుమతి (సికెడి - కంప్లీట్లీ నాక్డ్ డౌన్ రూట్లో) చేసుకొని, స్థానిక మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తున్నారు.

సుజుకి ఇనాజుమా 250 ధర తగ్గింపు

గతంలో సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 బైక్ ధరను రూ.3.05 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉండేది. అయితే, ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తగ్గించిన ఎక్సైజ్ సుంకాల కారణంగానే కంపెనీ దీని ధరను ఇంత అధిక మొత్తంలో తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని ధర రూ.2.14 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, పూనే).

సుజుకి ఇనాజుమా 250 ధర తగ్గింపు

ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెను వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. ఇక స్టయిలింగ్ విషయంలో ఇది జపనీస్ డిజైన్‌ను ప్రతిభింభింపజేస్తుంది.

సుజుకి ఇనాజుమా 250 ధర తగ్గింపు

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ 250 ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్ 250ఆర్, కవాసకి 250, కెటిఎమ్ డ్యూక్ 250 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఇది నలుపు, ఎరుపు రంగులలో మాత్రమే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 16, 2014, 14:56 [IST]
English summary
The Japanese manufacturer will be reducing the price of its Inazuma by INR 1,00,000. The price will vary from location to location as every state has its separate tax structure and percentage it charges. A recent decrease in excise duty is the major factor in the price deduction.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+