యాక్టివా 125కు కౌంటర్, సుజుకి స్విష్ 125 అప్‌డేటెడ్

By Ravi

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అందిస్తున్న 'స్విష్ 125' (Swish) స్కూటర్‌ను కంపెనీ సైలెంట్‌గా అప్‌డేట్ చేసింది. హోండా మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవలే విడుదల చేసిన లేటెస్ట్ 125సీసీ స్కూటర్ హోండా యాక్టివా 125 నుంచి ఎదురయ్యే పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేలా, సుజుకి స్విష్ 125 స్కూటర్‌లో కంపెనీ కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది.

సుజుకి యాక్సిస్‌కు స్టయిలిష్ వెర్షనే ఈ సుజుకి స్విష్. మోడ్రన్ డిజైన్ కలిగిన స్కూటర్‌ను కోరుకునే యువత కోసం సుజుకి ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇంజన్, డిజైన్ పరంగా ఇది హోండా యాక్టివా 125కి సమీప పోటీదారుగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో, సుజుకి స్విష్‌ను మరింత మోడ్రన్‌గా తీర్చిదిద్దేందుకు గాను కంపెనీ ఇందులో కాన్ని కాస్మోటిక్ మార్పులు చేసింది. అవేంటంటే..


కొత్త సుజుకి స్విష్ ఇప్పుడు డ్యూయెల్ టోన్ బాడీ గ్రాఫిక్స్ మరియు రీస్టయిల్డ్ ఇన్‌‍స్ట్రుమెంట్ ప్యానెల్‌తో లభిస్తుంది. ఈ కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇదివరటి కన్నా మరింత కలర్‌ఫుల్‌గా, స్పోర్టీగా ఉంటుంది. ఇది గ్లస్ స్పార్కల్ బ్లాక్, క్యాండీ ఆంటారెస్ రెడ్/గ్లాస్ స్పార్కల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్/గ్లాస్ స్పార్కల్ బ్లాక్, పెరల్ గ్లాసీయర్ వైట్ మరియు మెటాలిక్ ట్రైటన్ బ్లూ/గ్లాస్ స్పార్కల్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది.

కొత్త సుజుకి స్విష్ 125లో ఈ కాస్మోటిక్ మార్పులు తప్ప, యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. ఇందులో ఇదివరకటి 124సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.58 హార్స్ పవర్‌‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్ సుజుకి స్విష్ ధర రూ.59,350 (ఆన్-రోడ్) లుగా ఉంది.

Suzuki Swish 125 Refreshed

More from DriveSpark

Article Published On: Tuesday, May 13, 2014, 16:47 [IST]
English summary
Suzuki Motorcycle India has silently updated its Swish 125cc automatic scooter to better enable it counter the inevitable surge of the recently launched Activa 125.Suzuki Swish is the closest competitor to the Activa 125 in terms of performance and design. While powered by the same engine as the Access, the Swish has a smarter looking design that appeals better to younger buyers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+