భారత్‌లో సుజుకి వి-స్ట్రోమ్ 1000 ఏబిఎస్ సూపర్‌బైక్ విడుదల
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి మోటర్‌సైకిల్ ఇండియా లిమిటెడ్, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 'సుజుకి వి స్ట్రోమ్-1000' బైక్‌ను కంపెనీ వాణిజ్య పరంగా విడుదల చేసింది. ఇకనుంచి ఇది అన్ని సుజుకి టూవీలర్ డీలర్‌షిప్‌ల ద్వారా వినియోగదారులుకు అందుబాటులోకి రానుంది.
సుజుకి వి-స్ట్రోమ్ ఓ మంచి ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ బైక్. డ్యూయెల్ పర్పస్ కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. దేశీయ విపణిలో ఈ ప్రీమియం బైక్ ధర రూ.14.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా ఉంది. సుజుకి వి-స్ట్రోమ్ 1000 ఏబిఎస్ మోటార్‌సైకిల్‌ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన వి-స్ట్రోమ్ 650 ఏబిఎస్ మోడల్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో సుజుకి వి-స్ట్రోమ్ 1000 ఏబిఎస్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

సుజుకి వి-స్ట్రోమ్ 1000 ఏబిఎస్ బైక్‌లో 1037సీసీ, వి-ట్విన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 101 బిహెచ్‌పిల శక్తిని, 103 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సుజుకి వి-స్ట్రోమ్ 1000 ఏబిఎస్ బైక్‌ను గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగం వద్ద కూడా సౌకర్యవంతగా రైడ్ చేయవచ్చు. చిన్న చిన్న దూరాల కోసం (ప్రత్యేకించి రద్దీగా ఉండే సిటీ రోడ్లపై) ఈ బైక్‌ను ఉపయోగించడం కొంచెం సవాలుతో కూడున్నదే. హైవేపై మాత్రం ఇది మంచి ఫన్ టూ రైడ్ అనుభూతినిస్తుంది.

ఈ బైక్‌లో ఫుల్లీ అడ్జస్టబల్ యూఎస్‌డి (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్స్ ఉంటాయి. వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది మంచి రైడ్ క్వాలిటీని కలిగి ఉంటుంది. ప్రత్యేకించి ఇందులో 3-స్టెప్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)లు మంచి సేఫ్టీని ఆఫర్ చేస్తాయి.

ఇంత భారీ ఇంజన్ కలిగిన బైక్‌ను కొనేటప్పుడు ఎవరైనా మైలేజ్ గురించి ఆలోచిస్తారు. సుజుకి వి-స్ట్రోమ్ 1000 ఏబిఎస్ సిటీ రోడ్లపై సగటున 17-20 కి.మీ. మైలేజీని, ఓపెన్ రోడ్లపై 23-25 కి.మీ. మైలేజీనిస్తుంది.

సుజుకి వి-స్ట్రోమ్ 100. ఏబిఎస్ ఓ నేక్డ్ స్టైల్ బైక్. పవర్‌ఫుల్ ఇంజన్‌తో ఇటు ఆఫ్-రోడ్ అటు ఆన్-రోడ్ ప్రయోజనం కోసం ఓ మంచి విలాసవంతమైన బైక్ కోరుకునే వారికి ఇదొక చక్కని ఆప్షన్‌గా ఉంటుంది. అయితే, ధర మాత్రమే అధికం అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








