ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్
జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ 'టెర్రా ఏ4000ఐ' (Terra A4000i) అనే ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను ఐఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో ఐఫోన్‌ను ఫిక్స్ చేయటం ద్వారా బ్యాటరీ స్టేటస్, బ్యాటరీ ఖర్చయ్యే రేటు, ప్రయాణించే వేగం, మిగిలి ఉన్న బ్యాటరీతో ఎంత దూరం ప్రయాణించవచ్చు వంటి అనేక సాంకేతిక వివరాలను ఐఫోన్ సాయంతో తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా, టెర్రా ఏ4000ఐ స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో అమర్చిన ఐఫోన్ జిపిఎస్ నావిగేటర్ మాదిరిగా కూడా పనిచేసి, దిశానిర్ధేశం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ ఐఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే, త్వరలోనే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లతో పనిచేసేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.
టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఈ బ్యాటరీ జీవిత కాలం 50,000 కి.మీ. ఇది కేవలం 4.5 గంటల సమయంలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పూర్తి చార్జ్‌పై 65 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం గంటకు 65 కి.మీ., సగటు వేగం గంటకు 48 కి.మీ. ఈ స్కూటర్‌కు ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. దీని మొత్తం బరువు 118 కేజీలు (బ్యాటరీ బరువు 16 కేజీలు). భారత మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారు రూ.2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ
జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ 'టెర్రా ఏ4000ఐ' (Terra A4000i) అనే ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

బ్యాటరీ
టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఈ బ్యాటరీ జీవిత కాలం 50,000 కి.మీ. ఇది కేవలం 4.5 గంటల సమయంలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పూర్తి చార్జ్‌పై 65 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

రేంజ్
గరిష్ట వేగం గంటకు 65 కి.మీ., సగటు వేగం గంటకు 48 కి.మీ. ఈ స్కూటర్‌కు ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. దీని మొత్తం బరువు 118 కేజీలు (బ్యాటరీ బరువు 16 కేజీలు).

ఐఫోన్ కనెక్టివిటీ
ఈ స్కూటర్‌ను ఐఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో ఐఫోన్‌ను ఫిక్స్ చేయటం ద్వారా బ్యాటరీ స్టేటస్, బ్యాటరీ ఖర్చయ్యే రేటు, ప్రయాణించే వేగం, మిగిలి ఉన్న బ్యాటరీతో ఎంత దూరం ప్రయాణించవచ్చు వంటి అనేక సాంకేతిక వివరాలను ఐఫోన్ సాయంతో తెలుసుకోవచ్చు.

నావిగేషన్
టెర్రా ఏ4000ఐ స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో అమర్చిన ఐఫోన్ జిపిఎస్ నావిగేటర్ మాదిరిగా కూడా పనిచేసి, దిశానిర్ధేశం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ ఐఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే, త్వరలోనే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లతో పనిచేసేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

భారత్‌లో విడుదల
ఈ ఏడాది చివరి నాటికి టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదల చేస్తామని కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ధర
భారత మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారు రూ.2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








