హోండా కొత్త బైక్స్: సిబిఆర్400ఆర్, సిబి400ఎఫ్, సిబి400ఎక్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా 400సీసీ సిరీస్‌లో మూడు సరికొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. హోండా సిబిఆర్400ఆర్, హోండా సిబి400ఎఫ్, హోండా సిబి400ఎక్స్ (CBR400R, CB400F, CB400X) అనే మూడు విభిన్న మోటార్‌సైకిళ్లను జపాన్ నేటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్న 'ఒసాకా మోటార్ షో 2013'లో కంపెనీ విడుదల చేయనుంది. ఏషియా మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని హోండా ఈ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసింది.

యూఎస్, యూరోపియన్ మార్కెట్లో హోండా అందిస్తున్న 500సీసీ ఇంజన్‌ను రీట్యూన్ చేసి, దీని సామర్థ్యాన్ని 400సీసీకి కుదించి ఈ కొత్త బైక్‌లలో ఉపయోగించారు. వీటిని మార్చి 15-17 వరకూ జరగనున్న ఒసాకా మోటార్ షో, మార్చి 22-24 వరకూ జరగనున్న టోక్యో మోటార్ షోలలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇవి మూడు కూడా ప్రొడక్షన్ వెర్షన్ మోటార్‌సైకిళ్లే. ఇవి భారత మార్కెట్లో కూడా విడదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడు ఒకే సామర్థ్యంతో కూడిన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ, డిజైన్ పరంగా వేర్వేరుగా ఉంటాయి.

హోండా సిబిఆర్400ఆర్‌

హోండా సిబిఆర్400ఆర్‌

500సీసీ సిరీస్ హోండా అందిస్తున్న హోండా సిబిఆర్500ఆర్ స్పోర్ట్స్ బైక్‌కు 400సీసీ వెర్షనే ఈ హోండా సిబిఆర్400ఆర్‌.

హోండా సిబి400ఎఫ్

హోండా సిబి400ఎఫ్

హోండా సిబిఆర్400ఆర్‌ బైక్ నేక్డ్ వెర్షనే ఈ హోండా సిబి400ఎఫ్. హోండా సిబిఆర్400ఆర్‌ బైక్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే ఇందులోనూ ఉపయోగించారు.

హోండా సిబి400ఎక్స్ బైక్

హోండా సిబి400ఎక్స్ బైక్

ఇటు స్పోర్ట్స్ బైక్‌ను అటు నేక్డ్ బైక్‌ను కలిపి రూపొందించిన స్పోర్ట్ టూరర్ వెర్షనే ఈ హోండా సిబి400ఎక్స్ బైక్.

హోండా సిటిఎక్స్700ఎన్

హోండా సిటిఎక్స్700ఎన్

హోండా 'కంఫర్ట్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్' కాన్సెప్ట్ నుంచి అభివృద్ధి చేసిన క్రూయిజ్ మోడల్ కాన్సెప్ట్ ఈ హోండా సిటిఎక్స్700ఎన్.

హోండా సిటిఎక్స్700

హోండా సిటిఎక్స్700

హోండా సిటిఎక్స్700ఎన్ బైక్‌కు మరిన్ని అదనపు బాడీ ప్యానెల్స్ జోడించి రూపొందించిన క్రూయిజ్ బైక్ ఈ హోండా సిటిఎక్స్700.

హోండా సిఆర్ఎఫ్250ఎల్

హోండా సిఆర్ఎఫ్250ఎల్

హోండా సిఆర్ఎఫ్250ఎల్ మోటార్ మోడల్ ఆఫ్-రోడ్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఆన్-రోడ్ టైర్లతో రూపొందించిన బైక్.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2013, 10:14 [IST]
English summary
The Osaka Motorcycle Show and the Tokyo Motorcycle Show will take place between March 15 - March 17 and March 22 - March 24 respectively. Honda will showcase several prototype models at the shows it will also unveil a few production models, including three 399cc versions of its 500 series sports bikes. These bikes are the CBR400R, CB400F and 400X.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+