బైకర్స్ ఫెస్టివల్ 'ఇండియా బైక్ వీక్' 2014 ఎడిషన్ ప్రారంభం
ఇండియన్ బైకర్లకు అతిపెద్ద పండుగైన 'ఇండియా బైక్ వీక్' 2014 ఎడిషన్ అట్టహాసంగా జనవరి 17న గోవాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా గోవాకు చేరుకుంది. ఈ ఏడాది మునుపటి సంవత్సరం ఎక్కువ మంది బైక్ ప్రియులు ఇందులోపాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా ఔత్సాహికులు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు.
గడచిన సంవత్సరంలో నిర్వహించిన మొదటి ఎడిషన్ సక్సెస్ 'ఇండియా బైక్ వీక్' మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో ఈసారి 2014 ఎడిషన్ ఈవెంట్‌ను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భారత్‌లోని 70 ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ ట్రావెలర్ సంస్థలు గోవాలో జనవరి 17 మరియు 18, 2014 తేదీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ప్రపంచంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ కార్యక్రమాల్లో ఒకటైన, అమెరికాలోని సౌత్ డకోటాలో నిర్వహించే వార్షిక 'స్టుర్గిస్ మోటార్‌సైకిల్ ర్యాలీ' నుంచి స్ఫూర్తి పొంది ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని గడచిన సంవత్సరంలో తొలిసారిగా భారత్‌లో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఇండియా బైక్ వీక్ అనే పేరు పెట్టారు. ఇందులో వేలాది మంది బైకర్లు తమ కెఫే రేసర్ల నుంచి స్క్రాంబర్ల వరకు అలనాటి క్రూజర్ల నుంచి నేటి సూపర్‌బైక్‌ల వరకు వివిద రకాల బైక్‌లతో సందడి చేయనున్నారు.

మొదటి ఎడిషన్ ఇండియా బైక్ వీక్ కార్యక్రమానికి సుమారు 3,000 లకు పైగా బైక్‌లతో 6,547 మంది మోటారిస్టులు పాల్గొన్నారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళా రైడర్లు కూడా ఉన్నారు. ఈసారి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది.

ఇదివరకటి ఎడిషన్‌లో 3 కాన్సెర్ట్ స్టేజ్‌లు, 28 లైవ్ బ్యాండ్లు మరియు డిజేలు, 5 బార్లు, 16 కేజ్ ఫైటర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిర్వహించారు. ఈ ఏడాది వీటి పరిమాణాన్ని మరింత పెంచారు.

ఈ కార్యక్రమంలో బైకర్ల బృందం తమ బైక్‌లతో చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. గడచిన సంవత్సరం నిర్వహించిన ఇండియా బైక్ వీక్ 2012 ఎడిషన్‌లో అంతర్జాతీయ స్టంట్ స్పెషలిస్ట్ మాటీ గ్రిఫ్ఫిన్ కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా పలు స్టంట్ స్పెషలిస్టులు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఆహుతులను అలరిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఈవెంట్‌కు విచ్చేసే వీక్షకులు ఇందులో అనేక కస్టమ్, ఎగ్జోటిక్ బైక్‌లను చూడొచ్చు. గడచిన సంవత్సరం వై2కె టర్బైన్ ఇంజన్డ్ బైక్‌ను ప్రదర్శనకు ఉంచారు.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో కొత్త బైక్‌లు, ఉత్పత్తులు, యాక్ససరీలను కూడా విడుదల చేయటం జరుగుతుంది. బైక్ ప్రియుల కోసం ప్రత్యేక మార్కెట్ కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








