ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్ మోటార్‌సైకిల్ విడుదల

By Ravi

ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ట్రైయంప్' (Triumph) ఈనెల 18వ తేదీన ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. నేడు (సెప్టెంబర్ 18, 2014) ట్రైయంప్ ఇండియా తమ సరికొత్త క్రూడర్ మోటార్‌సైకిల్ 'ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి' (Triumph Thunderbird LT)ని విడుదల చేసింది.

దేశీయ మార్కెట్లో ట్రైయంప్ మోటార్‌సైకిల్ ఇండియా విడుదల చేసిన ఈ ప్రీమియం క్లాసిక్ క్రూజర్ బైక్ థండర్‌బర్డ్ ఎల్‌టి ధర రూ.15.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం క్రూజర్ బైక్ సెగ్మెంట్లో కంపెనీ విక్రయిస్తున్న థండర్‌బర్డ్ స్ట్రోమ్, రాకెట్ 3 రోడ్‌స్టర్ మోడళ్ల సరసన ఈ కొత్త థండర్‌బర్డ్ ఎల్‌టి బైక్‌ని ప్రవేశపెట్టారు.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి మోటార్‌సైకిల్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌‍లో తెలుసుకోండి.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి మోటార్‌సైకిల్‌కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి మోటార్‌సైకిల్ పేరులో ఎల్‌టి అంటే 'లైట్ టూరింగ్' (Light Touring) అని అర్థం.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్ మోటార్‌సైకిల్‌ను ఇప్పటికే అనేక గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి మోటార్‌సైకిల్‌లో 1699సీసీ, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ అందిస్తున్న థండర్‌బర్డ్ స్టోర్మ్ మోటార్‌సైకిల్‌లోను ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 93 బిహెచ్‌పిల శక్తిని, 151 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

మోటార్‌సైకిళ్లపై దూరప్రయాణాలు చేసే వారిని దృష్టిలో ఉంచుకొని ఈ క్రూజర్ మోటార్‌సైకిల్‌ను తయారు చేశారు. లాంగ్ రైడ్స్‌కు అనువుగా ఉండేలా సీటింగ్ పొజిషన్, ఏరోడైనమిక్స్ డిజైన్ చేశారు.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

రైడర్ మరియు పిలియర్ రైడర్ (వెనుక సీటుపై కూర్చునే వారి)కి సౌకర్యాన్ని అందించేలా డ్యూయెల్ లేయర్, డ్యూయెల్ డెన్సిటీతో ఫోమ్‌తో తయారు చేసిన సీట్లను ఉపయోగించారు.

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి కీలక ఫీచర్లు

* ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి సారిగా రేడియల్ టైర్లతో తయారు చేసిన ఆల్ట్రా-వైడ్ వైర్-స్పోక్డ్ వీల్స్

* కంఫర్టబల్ రైడ్స్ కోసం 30మి.మీ. ప్యాడింగ్‌తో కూడిన లోవర్ సీట్

* ష్రౌడెడ్ ఫోర్క్స్, క్విక్-డిటాచ్ విండ్‌షీల్డ్, డిటాచబల్ లెథర్ శాడల్ బ్యాగ్స్ అండ్ డీప్, కస్టమ్ స్టైల్ మడ్‌గార్డ్స్

* డ్యూయెల్ లేయర్ ఫోమ్ సీట్స్ విత్ లాంబార్ సపోర్ట్

* పెద్ద 21.9 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి క్రూజర్

ట్రైయంప్ థండర్‌బర్డ్ ఎల్‌టి మోటార్‌సైకిల్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కాస్పియన్ బ్లూ / క్రిస్టల్ వైట్ మరియు లావా రెడ్ / ఫాంటం బ్లాక్.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2014, 18:16 [IST]
English summary
Triumph Motorcycles India has launched its premium classic cruiser bike Thunderbird LT priced at Rs. 15.75 lakh (ex-showroom, Delhi). The new bike is a 'Light Touring' cruiser, ideal for long rides.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+