అఫీషియల్: నవంబర్ నెలలో ట్రైయంప్ ఇండియన్ ఎంట్రీ

By Ravi

ఇది అఫీషియల్. బ్రిటన్‌కు చెందిన పెర్ఫామెన్స్ మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ 'ట్రైయంప్' రానున్న నవంబర్ నెలలో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రీమియం బైక్ ప్రియులను ఆకట్టుకున్న ట్రైయంప్ వాస్తవానికి ఎప్పుడో భారత మార్కెట్లో ప్రవేశించాల్సి ఉండగా, పలు కారణాల వల్ల (అంతర్గత కారణాలు) జాప్యం జరిగింది.

ట్రైయంప్ ఇండియా విభాగానికి విమల్ సంబ్లీని మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించుకుంటున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా విమల్ మాట్లాడుతూ.. ట్రైయంప్‌లో చేరటం తనకు చాలా సంతోషంగా ఉందని, భారత మార్కెట్లో ట్రైయంప్ బ్రాండ్ వృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. లుక్స్, డిజైన్ అండ్ పెర్ఫామెన్స్ అంశాల్లో నిజమైన ఐకానికి మోటార్‌సైకిళ్లను తయారు చేయటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

ట్రైయంప్ తమ ఉత్పత్తులను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా భారత్‌కు దిగుమతి చేసుకొని హర్యానాలోని మానేసర్ వద్ద ఏర్పాటు చేస్తున్న (ప్రస్తుతం ఈ ప్లాంట్ తుది దశలో ఉంది) అసెంబ్లింగ్ యూనిట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. ట్రైయంప్ ఎక్కువగా నేక్డ్ బైక్‌లను ఆఫర్ చేస్తుంది. ఇవి ప్రత్యక్షంగా హ్యార్లీ డేవిడ్‌సన్ వంటి ప్రీమియం బైక్‌లతో పోటీ పడనున్నాయి. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

జాప్యానికి కారణం

జాప్యానికి కారణం

ట్రైయంప్ తొలుత సిబియూ రూట్లో భారత్‌లో వాహనాలను విక్రయించాలనుకుంది. అయితే, అధిక దిగుమతి సుంఖాల కారణంగా, సికెడి రూట్లో ఈ బైక్‌లను ఇండియాలనే అసెంబ్లిగ్ చేయటం ద్వారా తక్కువ ధరకే వీటిని అందించాలని కంపెనీ నిర్ణయించి.

మానేసర్‌లో అసెంబ్లిగ్ యూనిట్

మానేసర్‌లో అసెంబ్లిగ్ యూనిట్

ట్రైయంప్ ఇండియా ప్రస్తుతం మానేసర్‌లో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు నిర్మాణం తుది దశలో ఉంది. విడిభాగాలుగా దిగుమతి చేసుకున్న వాటికి ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నారు.

డీలర్‌షిప్ కేంద్రాలు

డీలర్‌షిప్ కేంద్రాలు

ట్రైయంప్ తొలుత ముంబై, ఢిల్లీ, బెంగుళూరు నగరాల్లో తమ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించనుంది. అనంతరం తమ నెట్‌వర్క్‌ను అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్ మరియు గోవా నగరాలకు విస్తరించనుంది.

కర్ణాటకలో మరొక ప్లాంట్

కర్ణాటకలో మరొక ప్లాంట్

కర్ణాటక రాజధానికి బెంగుళూరుకు శివార్లలోని నర్సాపూర్ వద్ద కూడా ట్రైయంప్ ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.

లేటెస్ట్ అప్‌డేట్స్

లేటెస్ట్ అప్‌డేట్స్

ట్రైయంప్ బ్రాండ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి..!

More from DriveSpark

Article Published On: Thursday, August 1, 2013, 13:07 [IST]
English summary
It's official. The British performance bike maker, Triumph Motorcycles will finally be setting up camp in India in November. Leading its Indian operation will be Vimal Sumbly, who has been appointed as the managing director. Sumbly happens to be a biking enthusiast himself and comes with about 16 years of experience in the Indian automobile sector.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+