నవంబర్ 28న ట్రైయంప్ ఇండియా కార్యకలాపాలు షురూ..
బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీ 'ట్రైయంప్' ఈనెలలో భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ట్రైయంప్ భారత్‌లో తమ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు తేదీని ఖరారు చేసింది. నవంబర్ 28, 2013న దేశీయ విపణిలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయటం ద్వారా తమ ప్రయాణం ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ట్రైయంప్ తమ ప్రీమియం బైక్‌లను ప్రదర్శనకు ఉంచింది. వాస్తవానికి అదే సంవత్సరంలో భారత్‌లో కార్యకాలాపాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల (అంతర్గత కారణాలు) జాప్యం జరిగింది. ట్రైయంప్ ఇండియా విభాగానికి విమల్ సంబ్లీని మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ట్రైయంప్ ఇండియా ఇప్పటికే తమ ఉత్పత్తులను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా భారత్‌కు దిగుమతి చేసుకొని హర్యానాలోని మానేసర్ వద్ద ఏర్పాటు చేస్తున్న (ప్రస్తుతం ఈ ప్లాంట్ తుది దశలో ఉంది) అసెంబ్లింగ్ యూనిట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.

మానేసర్‌లో అసెంబ్లిగ్ యూనిట్
ట్రైయంప్ ఇండియా ప్రస్తుతం మానేసర్‌లో ఓ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంటు నిర్మాణం తుది దశలో ఉంది. విడిభాగాలుగా దిగుమతి చేసుకున్న వాటికి ఇక్కడే అసెంబ్లింగ్ చేయనున్నారు.

కర్ణాటకలో మరొక ప్లాంట్
కర్ణాటక రాజధానికి బెంగుళూరుకు శివార్లలోని నర్సాపూర్ వద్ద కూడా ట్రైయంప్ ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది.

డీలర్‌షిప్ కేంద్రాలు
ట్రైయంప్ తొలుత ముంబై, ఢిల్లీ, బెంగుళూరు నగరాల్లో తమ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించనుంది. అనంతరం తమ నెట్‌వర్క్‌ను అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్ మరియు గోవా నగరాలకు విస్తరించనుంది.

కాంపిటీషన్
ట్రైయంప్ ఎక్కువగా నేక్డ్ బైక్‌లను ఆఫర్ చేస్తుంది. ఇవి నేరుగా హ్యార్లీ డేవిడ్‌సన్ వంటి ప్రీమియం బైక్‌లతో పోటీ పడనున్నాయి.


Click it and Unblock the Notifications








