ట్రైయంప్ టైగర్ ఎక్స్ఆర్ఎక్స్, ఎక్స్‌సిఎక్స్ బైక్స్ విడుదల
బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ కంపెనీ ట్రైయంప్, గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన ఇండియన్ బైక్ వీక్ 2015లో ప్రదర్శనకు ఉంచిన టైగర్ ఎక్స్‌సిఎక్స్, టైగర్ ఎక్స్ఆర్ఎక్స్ మోడళ్లను నేడు (మార్చ్ 3, 2015) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
ట్రైయంప్ టైగర్ ఎక్స్ఆర్ఎక్స్, ఎక్స్‌సిఎక్స్ ధరలు:
- ట్రైయంప్ టైగర్ ఎక్స్ఆర్ఎక్స్ - రూ.11.60 లక్షలు
- ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్ - రూ.12.70 లక్షలు
- ట్రైయంప్ టైగర్ 800 - రూ.10.50 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ట్రైయంప్ టైగర్ ఎక్స్ఆర్ఎక్స్, ఎక్స్‌సిఎక్స్ స్పెసిఫికేషన్స్:
ఈ రెండు మోటార్‌సైకిళ్లలోను ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బైక్‌లలోని 800సీసీ, త్రీ-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 93.66 హార్స్‌పవర్‌ల శక్తిని, 79 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇవి లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 19 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది.
ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్:
ఈ రెండు మోడళ్లలో కెల్లా ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్ మరింత రగ్గడ్‌గా ఉంటుంది. ఇందులో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్‌లు ఉంటాయి. అలాగే ఇందులో ముందు వైపు డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. స్పోక్ వీల్స్, ఏబిఎస్ (టర్న్ ఆఫ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది), సీటింగ్ అండ్ హ్యాండిల్‌బార్ పొజిషన్ అడ్జస్ట్‌మెంట్ ఫీచర్లున్నాయి.

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ఆర్ఎక్స్:
టైగర్ ఎక్స్‌సిఎక్స్‌లో ఉన్న అన్ని ఫీచర్లు టైగర్ ఎక్స్‌ఆర్ఎక్స్‌లో లభిస్తాయి. ఇందులో అడ్జస్టబల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉండదు. కాకపోతే ఇందులో అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. సిటీ రోడ్ రైడింగ్‌కి అనుగుణంగా ఈ బైక్ సీట్ హైట్‌ని తగ్గించారు.
ట్రైయంప్ టైగర్ ఎక్స్‌సిఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్ ఫీచర్లు:
- ఏబిఎస్
- ట్రాక్షన్ కంట్రోల్
- థ్రోటల్ మ్యాప్స్
- రైడింగ్ మ్యాప్స్
- క్రూయిజ్ కంట్రోల్
- ట్రిప్ కంప్యూటర్
- ఆక్స్ సాకెట్
- ఆటో క్యాన్సిల్ ఇండికేటర్
- అడ్జస్టబల్ విండ్‌స్క్రీన్
- హ్యాండ్ గార్డ్స్



Click it and Unblock the Notifications








