భారత్‌లో ట్రైయంప్ మోటార్‌సైకిళ్లు విడుదల: మోడళ్లు, ధరలు
బ్రిటీష్ మోటార్‌సైకిల్ కంపెనీ 'ట్రైయంప్' నవంబర్ 28, 2013న భారత మార్కెట్లో తమ కొత్త ఉత్పత్తులను విడుదల చేయటం ద్వారా, ఇక్కడి మార్కెట్లో తమ ప్రారంభిస్తుందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. నేడు ట్రైయంప్ దేశీయ విపణిలో ఏకంగా 10 కొత్త బైక్‌లను విడుదల చేసి, బైక్ ప్రియులను ఆకట్టుకుంది.
దేశీయ విపణిలో ట్రైయంప్ అందిస్తున్న ఈ కొత్త ఉత్పత్తుల్లో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తుండగా, మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.
ట్రైయంప్ భారత మార్కెట్లో విడుదల చేసిన ఆ 10 ఉత్పత్తుల విరాలు, వాటి ధరలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ట్రైయంప్ బోన్నెవిల్లె
* ధర: రూ.5.7 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 865సీసీ, 68 పిఎస్ @ 7500 ఆర్‌పిఎమ్ మరియు 68 ఎన్ఎమ్ @ 5800 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ బోన్నెవిల్లే టి100
* ధర: రూ.6.6 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 865సీసీ, 68 పిఎస్ @ 7500 ఆర్‌పిఎమ్ మరియు 68 ఎన్ఎమ్ @ 5800 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ డేటోనా 675ఆర్
* ధర: రూ.11.4 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 675సీసీ, 128 పిఎస్ @ 12500 ఆర్‌పిఎమ్ మరియు 75 ఎన్ఎమ్ @ 11900 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్
* ధర: రూ.7.5 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 675సీసీ, 106 పిఎస్ @ 11850 ఆర్‌పిఎమ్ మరియు 98 ఎన్ఎమ్ @ 9750 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్
* ధర: రూ.10.4 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 1050సీసీ, 135 పిఎస్ @ 9400 ఆర్‌పిఎమ్ మరియు 111 ఎన్ఎమ్ @ 7750 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ త్రక్స్టన్
* ధర: రూ.6.7 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 865సీసీ, 69 పిఎస్ @ 7400 ఆర్‌పిఎమ్ మరియు 69 ఎన్ఎమ్ @ 5800 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్
* ధర: రూ.20 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 2294సీసీ, 148 పిఎస్ @ 5750 ఆర్‌పిఎమ్ మరియు 221 ఎన్ఎమ్ @ 2750 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్
* ధర: రూ.17.9 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 1215సీసీ, 137 పిఎస్ @ 9300 ఆర్‌పిఎమ్ మరియు 121 ఎన్ఎమ్ @ 6400 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి
* ధర: రూ.12 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 800సీసీ, 95 పిఎస్ @ 9300 ఆర్‌పిఎమ్ మరియు 79 ఎన్ఎమ్ @ 7850 ఆర్‌పిఎమ్

ట్రైయంప్ థండర్‌బర్డ్ స్ట్రోమ్
* ధర: రూ.12.49 లక్షలు
* ఇంజన్, పెర్ఫామెన్: 1699సీసీ, 98 పిఎస్ @ 5200 ఆర్‌పిఎమ్ మరియు 156 ఎన్ఎమ్ @ 2950 ఆర్‌పిఎమ్


Click it and Unblock the Notifications








