చెన్నైలో ట్రైయంప్ డీలర్‌షిప్ ప్రారంభం
ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ట్రైయంప్' భారత మార్కెట్లో తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరించుకుంటోంది. ట్రైయంప్ తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. ట్రైయంప్‌కు ఇది దేశవ్యాప్తంగా 8వ షోరూమ్. హార్బర్ సిటీ ట్రైయంప్‌గా పిలిచే ఈ షోరూమ్‌ను 30, ఎతిరాజ్ సలై, ఎగ్మోర్, చెన్నై వద్ద ప్రారంభించారు.
రెబల్ మోటార్‌సైకిల్స్ ట్రైయంప్ డీలర్‌షిప్‌లో కొత్త వాహనాల సేల్స్‌తో పాటుగా సర్వీస్ మరియు స్పేర్ పార్ట్‌లను అలాగే ట్రైయంప్ బ్రాండెడ్ యాక్ససరీలు, రైడ్ గేర్‌లను కూడా ఆఫర్ చేయనున్నారు. దేశీయ విపణిలో ట్రైయంప్ విక్రయిస్తున్న మొత్తం పది మోడళ్లను ఈ షోరూమ్‌లో ప్రదర్శించనున్నారు. దేశీయ విపణిలో ట్రైయంప్ మోటార్ సైకిళ్ల ధరలు రూ.5.9 లక్షల నుంచి రూ.20 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ట్రైయంప్ గడచిన నవంబర్ నెలాఖరులో భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించి, 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఇందులో ఆరు మోడళ్లను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలను దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో అసెంబ్లింగ్ చేయనున్నారు. అవి - ట్రైయంప్ బోన్నెవిల్లె, ట్రైయంప్ బోన్నెవిల్లే టి100, ట్రైయంప్ డేటోనా 675ఆర్, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్, ట్రైయంప్ స్పీడ్ ట్రిపుల్, ట్రైయంప్ త్రక్స్టన్. మార్కెట్లో వీటి ధరలు రూ.5.7 లక్షల నుంచి రూ.11.4 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయి.
మిగిలిన నాలుగు మోడళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు. అవి - ట్రైయంప్ రాకెట్ 3 రోడ్‌స్టర్, ట్రైయంప్ టైగర్ ఎక్స్‌ప్లోరర్, ట్రైయంప్ టైగర్ 800 ఎక్స్‌సి, ట్రైయంప్ థండర్‌బర్డ్ స్ట్రోమ్. వీటి ధరలు రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








