ట్రైయంప్ స్క్రాంబ్లర్ బైక్‌ను డిజైన్ చేసిన రాజ్‌పుతాన కస్టమ్స్

By Ravi

ఇటీవల హ్యార్లీ డేవిడ్‌న్ స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ని కస్టమైజ్ చేసిన పూనేకి చెందిన పాపులర్ బైక్ కస్టమైజేషన్ కంపెనీ రాజ్‌పుతాన తాజాగా మరో లగ్జరీ మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేసింది. ట్రైయింప్ అందిస్తున్న ఓ పాపులర్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని రాజ్‌పుతాన ఓ స్క్రాంబ్లర్ లుక్ మోటార్‌సైకిల్‌ను కస్టమైజ్ చేసింది.

గడచిన వారం గోవాలో జరిగిన 2015 ఇండియా బైక్ వీక్ కార్యక్రమంలో ట్రైయంప్ ఈ కస్టమైజ్డ్ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ట్రైయంప్ అందిస్తున్న పాపులర్ బోన్‌విల్లే మోడల్‌ను ఆధారంగా చేసుకొని రాజ్‌పుతాన కస్టమ్ మోటార్‌సైకిల్ కంపెనీ ఈ మోడల్‌ను డిజైన్ చేసింది.

triumph scrambler rajputana customs at india bike week

ఈ కస్టమైజ్డ్ ట్రైయంప్ స్క్రాంబ్లర్‌ను మ్యాట్ గ్రే అండ్ బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. ఈ కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేయటానికి రాజ్‌పుతానకు దాదాపు రెండు నెలల సమయం పట్టిందట. భారతదేశంలో ట్రైయంప్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ బైక్‌ని డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.

triumph scrambler rajputana customs

హెడ్‌లైట్స్, హ్యాండిల్ బార్, ఎగ్జాస్ట్ పైప్స్, టెయిల్ ల్యాంప్స్ వంటి ప్రతి అంశంలోను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా.. ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 865సీసీ, పారలల్-ట్విన్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 61 పిఎస్‌ల శక్తిని, 61 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

triumph scrambler rajputana customs price and features

More from DriveSpark

Article Published On: Wednesday, February 25, 2015, 20:11 [IST]
English summary
The India Bike Week had many unique and heavily customised motorcycles as well. This was a perfect ground for bike builders to showcase their latest designs. One such eyecatcher was the Triumph Scrambler by Rajputana Customs at the Triumph stall.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+