2015లో టీవీఎస్ అపాచే 200 విడుదల; ఆ తర్వాత అపాచే 250

By N Kumar

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 200సీసీ మరియు 250సీసీ సెగ్మెంట్లలో తక్కువ ధర కలిగిన స్పోర్ట్స్ బైక్‌లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకు టీవీఎస్ అందిస్తున్న పాపులర్ అపాచే ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ ఎంచుకోనుంది.

ఇందులో భాగంగానే, 2015లో అపాచే 200సీసీ బైక్‌ను దాని తర్వాత అపాచే 250సీసీ బైక్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం అపాచే బ్రాండ్‌లో 160సీసీ మరియు 180సీసీ మోడళ్లు అందుబాటులో ఉ్ననాయి. టీవీఎస్ ఆర్ అండ్ డి హెడ్ వినయ్ హెర్నే ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ.. 2015లో కొత్త రేంజ్ అపాచే‌లను విడుదల చేస్తామని వెల్లడించారు.


180సీసీ సెగ్మెంట్‌కు ఎగువ 250సీసీ సెగ్మెంట్ వరకు 2 నుంచి 3 కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అయితే, సదరు ఉత్పత్తుల వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. కాగా.. గడచిన ఆటో ఎక్స్‌పో 2014లో కంపెనీ ఆవిష్కరించిన టీవీఎస్ డ్రాకెన్ కాన్సెప్ట్ బైక్ డిజైన్ ఎలిమెంట్స్‌ను కొత్త అపాచేలో చూసే అవకాశం ఉండొచ్చని అంచనా.

టీవీఎస్ డ్రాకెన్ బైక్‌ విషయానికి వస్తే, ఇదొక నేక్డ్ స్ట్రీట్ బైక్. ఇందులో 250సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. గ్రే కలర్‌లో పెయింట్ చేయబడిన అల్యూమినియం ట్రెల్లీస్ ఫ్రేమ్, ఎల్ఈడి హెడ్‌లైట్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, యూఎస్‌డి టెలిస్కోపిక్ ఫోర్క్ (ముందు వైపు అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు మోనోషాక్)లను ఈ కాన్సెప్ట్‌లో చూడొచ్చు.

TVS Draken Auto Expo

టీవీఎస్ డ్రాకెన్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏటంటే, ఇందులో ఎగ్జాస్ట్ అవుట్‌లెట్ (సైలెన్సర్) ఇంజన్‌కు దిగువనే ఉంటుంది. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను రివర్స్ ఫ్లో ఎగ్జాస్ట్ సిస్టమ్‌గా పిలుస్తారు. ఫ్యూయెల్ ఎఫీషయన్సీ (మైలేజ్)పై ప్రభావం పడకుండా ఉండేలా, పెర్ఫామెన్స్‌‌ను మరింత మెరుగు పరచేలా ఈ సిస్టమ్‌ను టీవీఎస్ రేసింగ్ ఎక్స్‌పీరియెన్స్ నుంచి అభివృద్ధి చేశారు. ఇంకా ఈ కాన్సెప్ట్ బైక్‌లో ముందు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన పెటల్ షేప్డ్ డిస్క్ బ్రేక్స్ ఇందులో మరో అదనపు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 11, 2014, 9:15 [IST]
English summary
TVS will expand its Apache lineup to include new products ranging up to the 250cc capacity mark and the first of this will be the Apache 200cc that will debut in 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+