టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 మ్యాట్ బ్లాక్ ఎడిషన్ విడుదల
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ అపాచే ఆర్‌టిఆర్ 180లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మ్యాట్ బ్లాక్ ఎడిషన్ పేరిట నలుపు రంగులో మ్యాట్ ఫినిష్‌తో కూడిన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.
ఈ ఏడాది జవరిలో జరిగిన 2014 ఇండియా బైక్ వీక్‌లో టీవీఎస్ ఈ కొత్త మ్యాట్ ఫినిష్ ఆర్‌టిఆర్ 180 మోడల్‌ను ప్రదర్శనకు ఉంచింది. ఇది మ్యాట్ బ్లాక్ బాడీ కలర్‌తో, మరిన్ని అదనపు గ్రాఫిక్స్‌తో లభిస్తుంది. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 మ్యాక్ బ్లాక్ ఎడిషన్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ చేంజెస్ లేవు.

ప్రస్తుత అపాచే ఆర్‌టిఆర్ 180లో ఉపయోగిస్తున్న 177.4సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త మ్యాట్ ఫినిష్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైక్‌లోను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 15.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
ఇది జస్ట్ కాస్మోటిక్ అప్‌గ్రేడ్ మాత్రమే. టీవీఎస్ తమ ప్రస్తుత తరం అపాచేను రీప్లేస్ చేసేందుకు ఓ సరికొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ తమ సరికొత్త అపాచే మోడల్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








