స్పెషల్ ఎడిషన్ అపాచే బైక్‌ను లాంచ్ చేయనున్న టీవీఎస్
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న అపాచే సిరీస్ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 10 లక్షల యూనిట్లను తాకాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180లో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి టీవీఎస్ ఇప్పటికే తమ ఫేస్‌బుక్ ఫ్యాన్‌పేజ్‌లో కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది. ఈ టీజర్లను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించవచ్చు.
టీవీఎస్ నుంచి రానున్న ఈ సరికొత్త అపాచే బైక్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి సాంకేతి మార్పులు ఉండబోవు. అయితే, బాడీ గ్రాఫిక్స్, ఆకర్షనీయమైన పెయిటింగ్ ఆప్షన్, సరికొత్త బాడీ ప్యానెల్స్ వంటి కాస్మోటిక్ మార్పులు ఉండే అవకాశం ఉంది. టీవీఎస్ అపాచే బైక్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 10,00,000 లకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం అపాచే 160సీసీ, 180సీసీ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180లో ఉపయోగించిన 117.04సీసీ ఇంజన్ గరిష్టంగా 17.05 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ అపాచే మిలియన్ సేల్స్ సందర్భాన్ని పురస్కరించుకొని కంపెనీ తమ ఫేస్‌బుక్ ఫ్యాన్‌పేజ్‌లో ఓ కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా, అపాచే బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ స్టాండర్డ్ టాంప్లేట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, తమ సృజనాత్మకతకు పనిచెప్పి ఓ అద్భుతమైన డిజైన్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులో బెస్ట్ గ్రాఫిక్స్ డిజైన్ చేసిన వారికి ఉచితంగా కొత్త అపాచే ఆర్‌టిఆర్ బైక్‌ను అందజేయడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం టీవీఎస్ అపాచే ఫేస్‌బుక్ ఫ్యాన్‌పేజ్‌ను సందర్శించండి.

టీవీఎస్ అపాచే టీజర్

టీవీఎస్ అపాచే టీజర్

టీవీఎస్ అపాచే టీజర్

టీవీఎస్ అపాచే టీజర్

టీవీఎస్ అపాచే కాంటెస్ట్



Click it and Unblock the Notifications








