ఆటో ఎక్స్‌పో 2014: టీవీఎస్ డ్రాకెన్ కాన్సెప్ట్ బైక్ ఆవిష్కరణ
చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో మరో అద్భుతమైన కాన్సెప్ట్ బైక్‌ను ప్రదర్శనకు ఉంచింది. గడచిన 2014 ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ క్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను ఆవిష్కరించి చూపరులను ఆకట్టుకున్న టీవీఎస్, ఈసారి 'డ్రాకెన్' (Draken) కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించింది.
డ్రాకెన్ ఒక 250సీసీ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్. నేక్డ్ స్ట్రీట్ బైక్ లుక్‌ని కలిగి ఉండే ఈ టీవీఎస్ డ్రాకెన్‌లో 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. బజాజ్-కెటిఎమ్, హీరో-ఈబిఆర్ కంపెనీలు కలిసి సంయుక్తంగా లో బడ్జెట్ స్పోర్ట్స్ బైక్‌లను అభివృద్ధి చేసినట్లుగా కాకుండా, టీవీఎస్ స్వయంగా ఈ డ్రాకెన్ కాన్సెప్ట్ బైక్‌ను తయారు చేసింది.

టీవీఎస్ డ్రాకెన్‌లో 250సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్‌కు సంబంధించిన పెర్ఫామెన్స్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
గ్రే కలర్‌లో పెయింట్ చేయబడిన అల్యూమినియం ట్రెల్లీస్ ఫ్రేమ్, ఎల్ఈడి హెడ్‌లైట్, డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, యూఎస్‌డి టెలిస్కోపిక్ ఫోర్క్ (ముందు వైపు అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు మోనోషాక్)లను ఈ కాన్సెప్ట్‌లో చూడొచ్చు.
టీవీఎస్ డ్రాకెన్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏటంటే, ఇందులో ఎగ్జాస్ట్ అవుట్‌లెట్ (సైలెన్సర్) ఇంజన్‌కు దిగువనే ఉంటుంది. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను రివర్స్ ఫ్లో ఎగ్జాస్ట్ సిస్టమ్‌గా పిలుస్తారు. ఫ్యూయెల్ ఎఫీషయన్సీ (మైలేజ్)పై ప్రభావం పడకుండా ఉండేలా, పెర్ఫామెన్స్‌ను మరింత మెరుగు పరచేలా ఈ సిస్టమ్‌ను టీవీఎస్ రేసింగ్ ఎక్స్‌పీరియెన్స్ నుంచి అభివృద్ధి చేశారు.

ఇంకా ఈ కాన్సెప్ట్ బైక్‌లో ముందు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన పెటల్ షేప్డ్ డిస్క్ బ్రేక్స్ ఇందులో మరో అదనపు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి టీవీఎస్ డ్రాకెన్ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ మాత్రమే. ఈ బైక్‌ను ఉత్పత్తి దశకు తీసుకువెళ్లే అంశాన్ని కంపెనీ ప్రస్థావించలేదు. అయితే, వచ్చే ఏడాది నాటికి ఇది ప్రొడక్షన్ దశకు చేరుకోవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








