టీవీఎస్ గ్రాఫైట్ కాన్సెప్ట్: ఫొటోలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

By Ravi

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ ఓ సరికొత్త స్కూటర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. డ్రాకెన్ (Draken) 250సీసీ స్పోర్ట్స్ బైక్ కాన్సెప్ట్‌తో వీక్షకులను ఆకట్టుకున్న టీవీఎస్, 'గ్రాఫైట్' (Graphite) పేరిట మరో 150సీసీ కాన్సెప్ట్ స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది.

స్పోర్టీ లుక్‌తో సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌ను అభివృద్ధి చేశారు. స్టీల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ నుంచి స్ఫూర్తి పొంది, టీవీఎస్ రేసింగ్ బృందం సహకారంతో ఈ స్కూటర్‌ను తయారు చేశారు. టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌కు సంబంధించిన అనేక ఆసక్తికమైరన ఫొటోలు, అంశాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌లో మెయిన్ పీచర్ ఏంటంటే, ఇది ఆటోమేటెడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ (క్లచ్ లేని మ్యాన్యువల్ గేర్‌బాక్స్)తో లభిస్తుంది. ప్యాడెల్ షిఫ్టర్ల (హ్యాండిల్ బార్ వద్ద ఉండే + , - బటన్స్‌ను నొక్కడం) ద్వారా గేర్లను మార్చుకోవాల్సి ఉంటుంది.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌లో ముందు వైపు 30 మి.మీ. టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను, వెనుక వైపు గ్యాస్ చార్జ్డ్ డాంపర్ ఉపయోగించారు.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

ఈ స్కూటర్‌లో 150సీసీ, ఫోర్ వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన ఇంజన్‌ను ఉపయోగించారు.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

ఈ స్పోర్టీ స్కూటర్‌లో అడ్వాన్స్డ్ ఫోర్స్డ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ గ్రాఫైట్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ ఫిల్లింగ్ క్యాప్, స్కూటర్ ఫుట్ బోర్డ్ మధ్యలో ఉంటుంది.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

ఇంకా ఇందులో డ్యూయెల్ ఛానెల్ డైనమిక్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ స్మార్ట్ స్టార్ట్ ఇగ్నిషన్ కీ వంటి ఫీచర్లున్నాయి.

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్

టీవీఎస్ గ్రాఫైట్ స్కూటర్‌లో వెహికల్ అండ్ ఇంజన్ స్టేట్ మరియు రైడ్ ఇన్ఫర్మేషన్‌లను అందించే అధునాతన ఎల్ఈడి డిస్‌ప్లే యూనిట్‌ను అమర్చారు.

టీవీఎస్ గ్రాఫైట్

టీవీఎస్ గ్రాఫైట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే. ఇది ఉత్పత్తి దశకు చేరుకునేందుకు ఎంత కాలం పడుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 11, 2014, 15:33 [IST]
English summary
TVS has showcased sporty scooter concept Graphite at Auto Expo. TVS Graphite is an aggressive and sporty looking scooter concept with a sharp edgy design and bright racing colour. The graphite takes its design inspiration from stealth fighter aircrafts and has been developed with the help of the TVS racing team.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+