హైదరాబాద్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ స్కూటర్ విడుదల
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన 110సీసీ ఆటోమేటిక్ స్కూటర్ 'టీవీఎస్ జూపిటర్' (TVS Jupiter)ను ఇప్పుడు రాష్ట్ర మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. టీవీఎస్ మోటార్ కంపెనీ రీజనల్ మేనేజర్ ఎస్. అరుణ్ కుమార్ ఈ కొత్త స్కూటర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త తరం ఫీచర్లతో వెలువడుతున్న టీవీఎస్ ఉత్పత్తుల్లో టీవీఎస్ జూపిటర్ సౌకర్యవంతమైన రైడింగ్, బెటర్ హ్యాండ్లింగ్, మెటల్ బాడీ, సాటిలేని క్సిలరేషన్, శక్తివంతమైన ఇంజన్, మెరుగైన మైలేజ్ తదితర అంశాలతో ఉన్నతమైన పనితీరును కనబరుస్తుందని చెప్పారు. ఈ స్కూటర్ లీటర్‌కు 62 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు.
రాష్ట్ర మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర రూ.48,400 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్
పురుషుల కోసం ప్రవేశపెట్టిన ఈ టీవీఎస్ జూపిటర్ ఓ 110సీసీ స్కూటర్. ఈ సివిటి-ఐ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ పవర్, ఎకానమీ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు
టీవీఎస్ జూపిటర్‌లో సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవి, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ (పెట్రోల్ పట్టించడం కోసం సీట్ ఎత్తాల్సిన అవసరం లేదు), గ్యాస్ ఫిల్డ్ రియర్ షాక్ అబ్జార్వర్స్ (సౌకర్యవంతమైన రైడ్ కోసం), ఎల్ఈడి ల్యాంప్స్, ఈజీ సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లతో ది లభిస్తుంది.

ఇతర ఫీచర్లు
ఇంకా ఇందులో ట్విన్ సిటీ ల్యాంప్స్, ఆప్షనల్ మొబైల్ ఛార్జర్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 5.3 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, 17 లీటర్ల అండర్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ ప్రిస్టీన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, వొల్కానో రెడ్ అనే నాలుగు సరికొత్త కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








