జూపిటర్‌లో మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టిన టీవీఎస్
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, ప్రత్యేకించి పురుషుల కోసం రూపొందించిన 'టీవీఎస్ జూపిటర్' స్కూటర్‌ను గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా టీవీఎస్ ఇందులో మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. స్పార్క్లింగ్ సిల్వర్, మ్యాట్ బీజ్ అనే రెండు కొత్త కలర్లలో టీవీఎస్ జూపిటర్ లభ్యం కానుంది.
టీవీఎస్ జూపిటర్ ఇప్పటి వరకు నాలుగు కలర్లలో మాత్రమే లభ్యమవుతోంది. ఇందులో కొత్తగా మరో రెండు కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టడంతో దీని మొత్తం కలర్ ఆప్షన్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. జూపిటర్ సౌకర్యవంతమైన రైడింగ్, బెటర్ హ్యాండ్లింగ్, మెటల్ బాడీ, సాటిలేని యాక్సిలరేషన్, శక్తివంతమైన ఇంజన్, మెరుగైన మైలేజ్ (62 కెఎమ్‌పిఎల్) తదితర అంశాలను కలిగి ఉంటుంది.
టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

ఇంజన్
పురుషుల కోసం ప్రవేశపెట్టిన ఈ టీవీఎస్ జూపిటర్ ఓ 110సీసీ స్కూటర్. ఈ సివిటి-ఐ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ పవర్, ఎకానమీ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు
టీవీఎస్ జూపిటర్‌లో సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవి, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ (పెట్రోల్ పట్టించడం కోసం సీట్ ఎత్తాల్సిన అవసరం లేదు), గ్యాస్ ఫిల్డ్ రియర్ షాక్ అబ్జార్వర్స్ (సౌకర్యవంతమైన రైడ్ కోసం), ఎల్ఈడి ల్యాంప్స్, ఈజీ సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లతో ది లభిస్తుంది.

ఇతర ఫీచర్లు
ఇంకా ఇందులో ట్విన్ సిటీ ల్యాంప్స్, ఆప్షనల్ మొబైల్ ఛార్జర్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 5.3 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, 17 లీటర్ల అండర్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ ప్రిస్టీన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, వొల్కానో రెడ్, స్పార్క్లింగ్ సిల్వర్ (కొత్తది), మ్యాట్ బీజ్ (కొత్తది) అనే ఆరు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.


Click it and Unblock the Notifications








