పురుషుల కోసం 'జూపిటర్' స్కూటర్‌ను విడుదల చేసిన టీవీఎస్
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, ప్రత్యేకించి పురుషుల కోసం రూపొందించిన ఓ సరికొత్త స్కూటర్‌ను నేడు (సెప్టెంబర్ 16, 2013) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో 'టీవీఎస్ జూపిటర్' (TVS Jupiter) పేరిట లభ్యం కానున్న ఈ ఆటోమేటిక్ స్కూటర్ ధర రూ.44,200 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో స్కూటర్ పరిశ్రమ ప్రోత్సాహకరంగా ఉంది. ఇది మరింత వృద్ధి చెందుతూ, విస్తరిస్తోంది. ఈరోజు 29 శాతం మంది మహిళలు స్కూటర్లను నడుపుతుండుగా, 36 శాతం మంది పురుషులు స్కూటర్లను నడుపుతున్నారు. టీవీఎస్ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకించి పురుషుల కోసం ఎలాంటి స్కూటర్ అందుబాటులో లేదు.
అమ్మాయిల కోసం కంపెనీ స్కూటీ పెప్ ప్లస్, స్కూటీ స్ట్రీక్ లను అందిస్తుండగా, అబ్బాయిలు-అమ్మాయిలు ఇద్దరికి ఉపయోగపడేలా వెగో స్కూటర్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ ఖాలీని భర్తీ చేసేందుకే, ప్రత్యేకించి పురుషుల కోసం ఈ టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్‌ను కంపెనీ విడుదల చేసింది.
టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్
పురుషుల కోసం ప్రవేశపెట్టిన ఈ టీవీఎస్ జూపిటర్ ఓ 110సీసీ స్కూటర్. ఈ సివిటి-ఐ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ పవర్, ఎకానమీ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు
టీవీఎస్ జూపిటర్‌లో సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవి, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ (పెట్రోల్ పట్టించడం కోసం సీట్ ఎత్తాల్సిన అవసరం లేదు), గ్యాస్ ఫిల్డ్ రియర్ షాక్ అబ్జార్వర్స్ (సౌకర్యవంతమైన రైడ్ కోసం), ఎల్ఈడి ల్యాంప్స్, ఈజీ సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లతో ది లభిస్తుంది.

ఇతర ఫీచర్లు
ఇంకా ఇందులో ట్విన్ సిటీ ల్యాంప్స్, ఆప్షనల్ మొబైల్ ఛార్జర్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 5.3 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, 17 లీటర్ల అండర్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ ప్రిస్టీన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, వొల్కానో రెడ్ అనే నాలుగు సరికొత్త కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








