టీవీఎస్ జూపిటర్ స్పెషల్ ఎడిషన్ విడుదల; ఫీచర్లు
చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'జూపిటర్' స్కూటర్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ జూపిటర్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానున్న కంపెనీ వివరించింది.
టీవీఎస్ మోటార్స్ విడుదల చేసిన జూపిటర్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ కొత్త కలర్ ఆప్షన్‌తో పాటుగా మరిన్ని అదనపు ఫీచర్లతో లభ్యం కానుంది. ఈ కొత్త మోడల్ 'స్టాలియన్ బ్రౌన్' అనే కలర్‌లో బీజ్ ఇన్నర్ ప్యానెల్స్‌తో లభిస్తుంది. ఈ స్కూటర్ ఫ్రంట్ ప్యానెల్‌పై స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇది కొత్త డ్యూరా కూల్ సీట్‌తో లభిస్తుంది. ఈ స్కూటర్‌ను ఎండలో పార్క్ చేసినప్పుడు, ఇతర సీట్లతో పోల్చుకుంటే, ఈ డ్యూరా కూల్ సీట్ తక్కువ వేడిని గ్రహిస్తుందని కంపెనీ వివరించింది.

టీవీఎస్ జూపిటర్‌లో 110సీసీ, సివిటి-ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ పవర్, ఎకానమీ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.
టీవీఎస్ జూపిటర్‌లో సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవి, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ (పెట్రోల్ పట్టించడం కోసం సీట్ ఎత్తాల్సిన అవసరం లేదు), గ్యాస్ ఫిల్డ్ రియర్ షాక్ అబ్జార్వర్స్ (సౌకర్యవంతమైన రైడ్ కోసం), ఎల్ఈడి ల్యాంప్స్, ఈజీ సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లతో ది లభిస్తుంది. ఇంకా ఇందులో ట్విన్ సిటీ ల్యాంప్స్, ఆప్షనల్ మొబైల్ ఛార్జర్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 5.3 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, 17 లీటర్ల అండర్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications








