టీవీఎస్ స్కూటీ జెస్ట్ విడుదల: ఫొటోలు, వివరాలు
చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన సంస్థ 'టీవీఎస్ మోటార్ కంపెనీ' అందిస్తున్న పాపులర్ స్మాల్ స్కూటర్ 'టీవీఎస్ స్కూటీ'లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'టీవీఎస్ స్కూటీ జెస్ట్' (TVS Scooty Zest) పేరిట గ్రేటర్ నోయిడాలో జరుగుతన్న 2014 ఆటో ఎక్స్‌పో వేదికగా కంపెనీ ఈ 110సీసీ మోడల్ స్కూటర్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది.
కంపెనీ అందిస్తున్న స్కూటీ పెప్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షనే ఈ స్కూటీ జెస్ట్. కొత్త స్టయిలిష్ బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడి ఇండికేటర్ ల్యాంప్స్, కొత్త రియర్ స్టాఫ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రాబ్ హ్యాండిల్ బార్స్ వంటి డిజైన్ మార్పులను ఇందులో గమనించవచ్చు. పెప్‌తో పోల్చుకుంటే, జెస్ట్‌లో ఈ కాస్మోటిక్ మార్పులతో పాటుగా మరింత విశాలమైన సీట్, పెద్ద ఫుట్ బోర్డ్, 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, హెవీ బాడీ వంటి మార్పులు కూడా ఉన్నాయి.

ఈ మార్పులు ఎన్ని ఉన్నప్పటికీ, దీని బేసిక్ డిజైన్‌లో రెగ్యులర్ స్కూటీ డిఎన్ఏ స్పష్టంగా కనిపిస్తుంటుంది. బ్రాండ్ ఐడెంటిటీని అలానే ఉంచేందుకు టీవీఎస్ దీని కలర్‌ను డ్యూయెల్ టోన్‌తో డిజైన్ చేసింది. స్కూటీ జెస్ట్ ఆకర్షనీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో 109.7సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు (వెగో స్కూటర్లో ఉపయోగించిన ఇంజన్). ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. వాస్తవానికి, టీవీఎస్ వెగో ఛాస్సిస్, వీల్‌బేస్, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌లనే జెస్ట్ స్కూటర్‌లో కూడా ఉపయోగించారు.

అయితే, టీవీఎస్ వెగోలో 12 ఇంచ్ వీల్స్ అమర్చితే, టీవీఎస్ స్కూటీ జెస్ట్‌లో 10 ఇంచ్ వీల్స్ ఉపయోగించారు. ఇది లీటరు పెట్రోల్‌కు గరిష్టంగా 62 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. అండర్ సీట్ లైట్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్ వంటి పలు విశిష్టమైన ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఇది వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications








